హాలీవుడ్‌ రీమేక్‌లో అక్కా చెల్లెలు..!

లోక నాయకుడు కమల్ హాసన్ తనయలు శ్రుతీ హాసన్‌, అక్షరా హాసన్ కలిసి ఓ మూవీలో నటించబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో.

హాలీవుడ్‌ రీమేక్‌లో అక్కా చెల్లెలు..!

Updated on: Jul 14, 2020 | 1:41 PM

లోక నాయకుడు కమల్ హాసన్ తనయలు శ్రుతీ హాసన్‌, అక్షరా హాసన్ కలిసి ఓ మూవీలో నటించబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. ఓ హాలీవుడ్‌ రీమేక్‌లో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయని టాక్.

అసలు విషయంలోకి వెళ్తే.. హాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘డోన్ట్ బ్రీత్’‌ను తమిళ్‌లో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇందులో ప్రధాన పాత్ర కోసం చియాన్ విక్రమ్ కూడా ఫైనల్ అయ్యారు. ఇక ఈ రీమేక్‌లోనే ఈ అక్కా చెల్లెలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరగబోతున్నట్లు సమాచారం. కాగా మరోవైపు రవితేజ సరసన శ్రుతీ హాసన్ నటించిన క్రాక్‌.. త్వరలో ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us