తమన్నాకు బర్త్ డే విషెస్ తెలిపిన ‘ సీటీమార్ ‘ టీమ్.. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీబ్యూటీ

'హ్యాపీడేస్' సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మపుట్టిన రోజు నేడు.

తమన్నాకు బర్త్ డే విషెస్ తెలిపిన ' సీటీమార్ ' టీమ్.. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీబ్యూటీ
Follow us

|

Updated on: Dec 21, 2020 | 6:20 PM

‘హ్యాపీడేస్’ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమన్నాకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, పలువురు సినిమా తారలు. ఈ క్రమంలో తమన్నా నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రయూనిట్ ఆమెకు  బర్త్ డే విషెస్ తెలిపింది.

యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి తమన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమె పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా కనిపించబోతోంది మిల్కీబ్యూటీ. ఇక ఈ చిత్రంలో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడబోతుంది. కాగా సినిమాలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా.. తమన్నా తెలంగాణ మహిళా జట్టుకు కోచ్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.