బాలీవుడ్లో సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్.ఖాన్ ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌పై వరుసగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘రాధే’పై నెగెటివ్ రివ్యూలతో మొదలైన ఆయన విమర్శలు సల్లూభాయ్ సొంత బ్రాండ్ ‘బీయింగ్ హ్యూమన్’ దాకా చేరాయి. అదేవిధంగా ‘రాధే’ హీరోయిన్ దిశా పటానీని, సల్మాన్‌తో సన్నిహితంగా ఉండే షారుఖ్ ఖాన్, గోవిందా తదితర సెలబ్రిటీలపై కూడా పదునైన విమర్శలు చేస్తున్నారు కమల్. సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రాధే’ సినిమా సమయంల కమల్‌పై కోర్టు మెట్లెక్కిన సల్మాన్ మరోసారి ఈ సినీ క్రిటిక్పై కేసు దాఖలు చేశాడు. ఈ విషయాన్ని కమలే సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
సల్మాన్ నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడా..
‘నాకు కోర్టు నుంచి మళ్లీ నోటీసులు అందాయి. సల్మాన్‌కు వ్యతిరేకంగా నేను ఏ వీడియో చేయలేదు. అతను నటించిన ఏ సినిమాకు నేను రివ్యూ ఇవ్వలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. కానీ, అతను నాకు వ్యతిరేకంగా అతడు మరోసారి కేసు వేశాడు. ఈ కేసు విచారణకు నవంబర్ 29న రాబోతోంది. సల్మాన్ ఖాన్ నన్ను ఇంత లవ్ చేస్తున్నాడని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అతడు 24*7 ప్రతి క్షణం నన్ను మిస్ అవుతున్నాడు ’’ అని ట్విట్టర్లో కమల్ రాసుకొచ్చారు.
Since court order came, I haven’t made any video about #SalmanKhan neither reviewed any of his film, song or trailer, nor tweeted about him. But he filed one more case against me n hearing is on 29th November. I am surprised that @BeingSalmanKhan loves me so much & miss me 24*7!
— KRK (@kamaalrkhan) November 22, 2021
Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్