కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు.. అసలు ఏం జరిగిందో చెప్పిన సిబ్బంది

|

Jan 16, 2025 | 7:27 PM

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. కత్తితో 6 సార్లు పొడిచాడు ఓ దుండగుడు. కాగా ఈ దాడిలో రెండు కత్తి పోట్లు చాలా లోతుగా దిగాయి అని వైద్యులు తెలిపారు.. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు.. అసలు ఏం జరిగిందో చెప్పిన సిబ్బంది
Saif Ali Khan
Follow us on

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన దొంగలు కత్తితో దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనలో సైఫ్ ఆరు చోట్ల తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే దాడి సమయంలో ఇంట్లో సైఫ్ అలీఖాన్ ఒక్కడే ఉన్నాడని సమాచారం. కరీనా కపూర్ జనవరి 15 బుధవారం రాత్రి కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్‌లతో కలిసి ఓ  పార్టీకి హాజరయ్యారు. కరీనా కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పార్టీకి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఆమె ‘గర్ల్స్’ నైట్ ఇన్’ అనే క్యాప్షన్‌ను షేర్ చేసింది. గురువారం తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య దొంగలు చోరీకి ప్రయత్నించారని చెబుతున్నారు. దొంగలను అడ్డుకునే క్రమంలో సైఫ్ పై దాడి చేశారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :పాపం ఈ హీరోయిన్..! అప్పుడు డ్రగ్స్ కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషి అని తేల్చారు..

ఇక నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సైఫ్ అలీఖాన్ ఇల్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దొంగకు సంబందించిన సీసీ ఫుటేజ్ వీడియోను కూడా విడుదల చేశారు పోలీసులు. ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో ఇంటి పనివాళ్లపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సైఫ్ ఇంటికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 4 మంది గార్డులు పనిచేస్తున్నారు. అయితే దొంగ ఎలా వచ్చాడన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇది కూడా చదవండి :కోయ్.. కోయ్..కాకరేపిందిరోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చూడచక్కని భామ

సైఫ్ నివాసంలో ఉద్యోగం చేస్తున్న 56 ఏళ్ల నర్సు ఇలియామా ఫిలిప్ ఈ ఘటన గురించి వివరించింది. సుమారు 30 ఏళ్ళు ఉన్న ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చాడని.  సైఫ్ అలీ ఖాన్ 4 ఏళ్ల కుమారుడు జెహ్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్‌లోకి అతను ప్రవేశించాడని తెలిపింది. అతను కత్తితో ఆమెను బెదిరించాడని తెలిపింది. కోటి రూపాయిల డిమాండ్ చేశాడు. నేను ప్రతిఘటించే క్రమంలో నాపై దాడి చేశాడు. దాంతో నాకు గాయాలు అయ్యాయి. పెద్దగా కేకలు వేయడంతో సైఫ్ అక్కడికి పరిగెత్తుకు వచ్చాడు. తమ పై దాడి చేస్తున్న దొంగను అడ్డుకునే క్రమంలో సైఫ్ కు గాయాలయ్యాయి. కత్తితో సైఫ్ పై అతను దాడి చేశాడు. సైఫ్  మెడ, భుజం, వీపు, మణికట్టుపై కత్తితో దాడి చేశాడు. మరో సిబ్బంది గీత అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆమెకు కూడా గాయాలు అయ్యాయి.. మరికొంతమంది సిబ్బంది వచ్చేలోపే ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని తెలిపింది నర్సు ఇలియామా ఫిలిప్. పోలీసులు ఈ వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి