యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘రౌడీ బేబీ’.. ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా..!

| Edited By:

Jul 21, 2020 | 1:09 PM

ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన 'మారి 2'లోని రౌడీ బేబీ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఆడియో విడుదలైనప్పటి నుంచి ఈ పాటకు మంచి క్రేజ్ ఉండగా..

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న రౌడీ బేబీ.. ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలుసా..!
Follow us on

ధనుష్‌, సాయి పల్లవి జంటగా నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబీ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఆడియో విడుదలైనప్పటి నుంచి ఈ పాటకు మంచి క్రేజ్ ఉండగా.. వీడియో వచ్చిన తరువాత ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో రౌడీ బేబీ పాట దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట 901 మిలియన్ల వ్యూస్‌ని‌ క్రాస్ చేసింది. యువన్ శంకర్ రాజా మాస్ బీట్‌, ఢీ గాత్రం, ప్రభుదేవా కొరియోగ్రఫీ,  సాయి పల్లవి డ్యాన్స్‌.. ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో సౌతిండియాలో అత్యధిక వ్యూస్‌ సాధించిన పాటల లిస్ట్‌లో రౌడీ బేబీ మొదట్లో నిలిచింది. చూస్తుంటే త్వరలోనే ఈ పాట 1 బిలియన్‌ వ్యూస్‌ లిస్ట్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.