
Sai Dharam Tej Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తున్న మెగా హీరో సయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. అతివేగం ప్రమాదానికి మూల కారణం అయితే, రోడ్డుపై మట్టి ఉండటం వలన బైక్ స్కిడ్ అయిందని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. అతివేగంతో పాటు.. రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్ స్కిడ్ అయ్యిందని, సాయిధరమ్ తేజ్ ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయలేకపోయారని పేర్కొన్నారు. అయితే, డ్రైవింగ్ సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ ధరించారని అన్నారు. ఆయన మద్యం సేవించలేదని నిర్ధారించుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో సాయిధరమ్ తేజ్ బైక్ 150 స్పీడ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. రైడింగ్ జాకెట్, గ్లౌసెస్, హెల్మెట్, షూ ధరించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఆయన్ను మెడికవర్ ఆస్పత్రికి తరలించామని మాధాపూర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.
అపోలో ఆస్పత్రికి చేరుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్..
కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్‌ను మెడికవర్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. సాయి తేజ్ కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్, తదితరులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అపోలో ఎండీ సంగీత రెడ్డి కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. మరో మూడు సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరింత క్లారిటీ ఇస్తామని వైద్యులు తెలిపినట్లు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.
Also read:
Sai Dharam Tej Accident: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. క్షేమంగా బయటపడటానికి కారణమదే..
Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్ క్షేమంగానే ఉన్నాడు.. మెడికవర్ ఆస్పత్రి వద్ద పవన్ కళ్యాణ్..
Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి ధరమ్ తేజ్- Watch Video