SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌…

|

Nov 18, 2021 | 2:05 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న..

SS Rajamouli: ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌...
Follow us on

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఓలీవియా మోరీస్‌, అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియా శరన్‌ తదితర ప్రముఖులు ఈ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే భారీ హంగులు, సెట్టింగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్‌లు, లిరికల్‌ వీడియోలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో 50 రోజుల్లో మీ ముందుకు…
కాగా ఈ చిత్రాన్ని మొదలుపెట్టి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిత్రబృందం బృందం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. 2017లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయాన్ని ఇద్దరు హీరోలతో సరదాగా కలిసి ఉన్న ఫొటో ద్వారా ప్రకటించారు రాజమౌళి. ఇప్పుడు ఇదే ఫొటోను ట్యాగ్ చేస్తూ ‘ నాలుగేళ్ల క్రితం ఈ ఫొటోను షేర్‌ చేసి అభిమానుల్లో ఎన్నో అంచనాలు రేకెత్తించాం. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొదలు పెట్టి 3 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. మరో 50 రోజుల్లో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం. జనవరి 7న కలుద్దాం. లెట్స్‌ బ్లాస్ట్‌’ అని చిత్రబృందం రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Preity Zinta: కవలలను ఆహ్వానించబోతున్నాం అంటూ గుడ్ న్యూస్‌ను పంచుకున్న సొట్టబుగ్గల సుందరి..

EMK 1 Crore Winner Raja Ravindra Interview: గెలుచుకున్న కోటి ఎం చేస్తానంటే..చరిత్ర సృష్టించిన రాజా రవీంద్ర మాటల్లో..(వీడియో)

Vijay sethupathi: మక్కల్‌ సెల్వన్‌పై దాడి ఘటన.. హిందూ వాది అర్జున్‌ సంపత్‌పై కేసు నమోదు..