KGF 2 Movie : రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ ఛాప్టార్ 2 డ్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

May 09, 2021 | 1:40 PM

ప్రజెంట్ నేషనల్‌ లెవల్‌ ఫిలిం లవర్స్‌ కూడా సౌత్ ఇండియన్ సినిమా కేజీఎఫ్‌ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌...

KGF 2 Movie : రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ ఛాప్టార్ 2 డ్యూరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Follow us on

KGF 2 Movie : ప్రజెంట్ నేషనల్‌ లెవల్‌ ఫిలిం లవర్స్‌ కూడా సౌత్ ఇండియన్ సినిమా కేజీఎఫ్‌ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ కావటంతో సీక్వెల్ మీద హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ రేంజ్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్‌. ఇక కేజీఎఫ్‌ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణాల్లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వస్తోన్న సీక్వెల్‌ చిత్రంలో అంతకు మించిన యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయట.  ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ , రవీనా టాండన్ నటిస్తున్నారు. అయితే  తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా లెంగ్త్‌ మూడు గంటలకు పైనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ స్టార్‌ కాస్ట్‌ ఉండటం కంటెంట్ పరంగానూ ఎక్కువ స్కోప్‌ ఉండటంతో సినిమాను కాస్త లెంగ్తీగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌. దీంతో కేజీఎఫ్‌ ఫ్యాన్స్‌లో టెన్షన్‌ మొదలైంది.ఈ జనరేషన్‌లో ఇంత లెంగ్తీ సినిమా చూస్తారా..? అన్న డౌట్స్ కూడా రెయిజ్‌ అవుతున్నాయి. అసలే ఓటీటీకి అలవాటు పడ్డ జనాలు షార్ట్ అండ్‌ స్వీట్ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ టైంలో మూడు గంటలకు పైగా ఆడియన్స్‌ను థియేటర్లో కూర్చోపెట్టాలి అంటే సాలిడ్‌ స్క్రిప్ట్ కావాలి. మరి కేజీఎఫ్‌ 2 ఆ రేంజ్‌లో ఉంటుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dhethadi Harika: డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన దేత్తడి హారిక… ( వీడియో )

Actress Rashi Khanna: అందాల రాశికి ఆఫర్ల వెల్లువ.. ఏకంగా ఏడు సినిమాల్లో ఛాన్స్..

Happy Birthday vijay devarakonda: హ్యాపీ బర్త్ డే రౌడీ బాయ్‌.. నార్త్‌లో కూడా విజయ్ క్రేజ్ మోతమోగిస్తోంది.