న‌న్ను చంపినా.. తప్పక సినిమా రిలీజ్ అవుతుంది

సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీ పార్వతి దృష్టికోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన రెండు ట్రైలర్స్ ను ఇప్పటికే విడుదల చెయ్యగా.. నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22న చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తుండ‌గా, కొంద‌రు చిత్రాన్ని […]

న‌న్ను చంపినా.. తప్పక సినిమా రిలీజ్ అవుతుంది
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 2:31 PM

సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్ర‌స్తుతం ల‌క్ష్మీ పార్వతి దృష్టికోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన రెండు ట్రైలర్స్ ను ఇప్పటికే విడుదల చెయ్యగా.. నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22న చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తుండ‌గా, కొంద‌రు చిత్రాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ సినిమా రిలీజ్‌ని ఆపాలంటే ముందుగా నన్ను చంపండి. ఒక‌వేళ న‌న్ను చంపినా కూడా సినిమా రిలీజ్ ఆగ‌దు. ఓ హార్డ్ డిస్క్ లో ర‌ష్ అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవ్వరూ ఆపలేరు అని వర్మ ఓ ఇంట‌ర్వ్యూలో స్పష్టం చేశారు. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఏయే అంశాలు చూపిస్తాడా అనే దానిపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Latest Articles
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
4 ఓవర్లలో 42 పరుగులు.. అయినా సెల్యూట్ చేస్తోన్న ప్రపంచం..
4 ఓవర్లలో 42 పరుగులు.. అయినా సెల్యూట్ చేస్తోన్న ప్రపంచం..
అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?