‘ఆచార్య’ కోసం చెర్రీ పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడా..!

| Edited By:

Sep 28, 2020 | 1:47 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే

ఆచార్య కోసం చెర్రీ పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడా..!
Follow us on

Ram Charan Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో దాదాపు 40 నిమిషాల పాటు చెర్రీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చాలా కీలకమైందని, స్టోరీ చెప్పే సమయంలోనే ఇందులో చెర్రీని ఊహించుకున్నట్లు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ కోసం రాజమౌళి, చెర్రీకి పర్మిషన్ ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ పాత్ర కోసం చెర్రీ బరువు పెరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి తక్కువ సమయం ఉండటంతో ఆ లోపే లావు అవ్వనున్నారట చెర్రీ. దీన్ని చెర్రీ ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం పర్‌ఫెక్ట్‌గా ఉన్న చెర్రీ మళ్లీ బరువును పెంచుకోవడం పెద్ద రిస్క్‌ లాంటిదే. ఎందుకంటే బరువు పెరిగి, మళ్లీ సన్నబడటం.. అందునా జక్కన్నను మెప్పించే విధంగా ఇప్పుడు ఉండేలా మారడం సవాల్‌తో కూడుకొన్నది. కానీ తన తండ్రితో కలిసి నటించాలన్నది తన తల్లి కోరిక అని ఇదివరకే చెప్పిన చెర్రీ.. ఆచార్యలో పాత్ర కోసం ఈ సవాల్‌ని స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేసి, ఆ తరువాత మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం చెర్రీ వర్కౌట్‌ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కాస్త కష్టమైనదే అయినప్పటికీ, తన తల్లి కోరిక కోసం చెర్రీ కష్టపడుతున్నట్లు సమాచారం.

Read More:

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సోనూ సూద్‌.. ఎగబడ్డ అభిమానులు

శ్రావణి కేసు: ముగిసిన దేవరాజ్‌, సాయికృష్ణల పోలీస్ కస్టడీ