Ram Charan : రామ్ చరణ్, సుకుమార్ సినిమా ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ భార్య ఎలివేషన్ పోస్ట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా పై ఇప్పటికే విపరతీమైన క్యూరియాసిటీ నెలకొంది. గతంలో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో కలిసి సినిమా చేస్తున్నారు చరణ్. దీంతో వీరిద్దరి కాంబో పై మంచి హైప్ పెరిగింది. అయితే కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న ఆర్సీ 17 ప్రాజెక్ట్ ప్రారంభ పూజా నవంబర్ 1న జరగనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

Ram Charan : రామ్ చరణ్, సుకుమార్ సినిమా ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ భార్య ఎలివేషన్ పోస్ట్..
Rc 17 Update

Updated on: Oct 31, 2026 | 9:44 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. అంతేకాదు కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు అటు ఫిల్మ్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. నవంబర్ 1న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. మరుసటి రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్.

కాగా, సినిమా పూజా కార్యక్రమానికి కొన్ని గంటల ముందు దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. “సుక్కు భార్యగా ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఆయన ఈ స్క్రిప్ట్ కోసం పడ్డ కష్టం, వెచ్చించిన సమయం నాకు తెలుసు. అందరికీ ఇష్టమైన ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలనుకుంటున్నాను” అంటూ తబిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా రామ్ చరణ్, సుకుమార్‌లకు ఎలివేషన్ ఇస్తూ ఆమె షేర్ చేసిన వీడియోకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ యాడ్ చేయడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్ల విషయంలోనూ ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ సినిమాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించగా.. ఈ చిత్రానికి మాత్రం ఆయన స్థానంలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బాధ్యతలు చేపట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

ఇదిలాఉంటే, ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట సారా అర్జున్, అనీత్ పడ్డా పేర్లు వినిపించినప్పటికీ.. తాజాగా తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. అయితే ఓపెనింగ్ పూజా కార్యక్రమాల సమయానికి ఆమె హైదరాబాద్‌లో లేకపోవడం వంటి పరిణామాలు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏదేమైనప్పటికీ, మెగా కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

తభిత సుకుమార్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Loading...
Unable to load recommendations.
Follow Us