
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ తనదైన ముద్ర వేయడం ఖాయం. ఇటీవల మిలాన్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక ‘బల్గారీ’ ఈవెంట్‌లో ప్రియాంక మరోసారి తన గ్లామర్‌తో ప్రపంచాన్ని ఫిదా చేసింది. ముందుగా బ్లాక్ అవతార్‌లో మెరిసిన ఈ ‘దేశీ గర్ల్’, తాజాగా ఒక దేవదూతలా ‘పేల్ గ్రీన్’ రంగు గౌనులో రెడ్ కార్పెట్ మీద తళుక్కుమంది. సౌత్ కొరియన్ నటుడు కిమ్ జి-వాన్‌తో కలిసి ఆమె చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ వేడుకలో ప్రియాంక ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నికోలస్ జెబ్రాన్ 2026 స్ప్రింగ్ కలెక్షన్ నుండి ఒక అందమైన గౌనును ఎంచుకుంది. ఈ స్ట్రాప్‌లెస్ గౌనుకు ఉన్న థై-హై స్లిట్, బ్లష్-ఫెదర్డ్ స్లీవ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శరీరానికి హత్తుకునేలా ఉన్న ఈ డ్రెస్ ప్రియాంక అందాన్ని మరింత రెట్టింపు చేసింది. బల్గారీ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన రత్నాలు పొదిగిన నెక్లెస్, డాంగ్లర్ ఇయర్ రింగ్స్ మరియు స్టేట్‌మెంట్ రింగ్స్ ధరించి విలాసవంతంగా కనిపించింది. థిబౌడ్ సల్దుచి స్టైలింగ్‌లో ప్రియాంక మినిమలిస్ట్ మేకప్‌ను ఎంచుకుంది. గ్లోసీ పింక్ లిప్ కలర్, సాఫ్ట్ కర్ల్స్ జుట్టుతో ఆమె లుక్ చాలా ఫ్రెష్‌గా ఉంది.
అంతకుముందు జరిగిన వేడుకలో ప్రియాంక ఆల్-బ్లక్ మెర్మైడ్ సిల్హౌట్ గౌనులో కనిపించింది. సయీద్ కోబీసీ డిజైన్ చేసిన ఈ డ్రెస్ పై ఉన్న స్కల్ప్చరల్ ప్లీటింగ్ అందరినీ ఆకట్టుకుంది. దీనికి జతగా ఎమరాల్డ్ (పచ్చలు) పొదిగిన డైమండ్ నెక్లెస్ ధరించి ఒక రాకుమారిలా మెరిసిపోయింది. ఈ వేడుకలో ప్రియాంక కేవలం ఒంటరిగా కాకుండా.. బల్గారీ ఇతర బ్రాండ్ అంబాసిడర్లైన డ్యూవా లిపా, ఆన్ హాత్వే, లియు యీఫీ మరియు జేక్ గైలెన్‌హాల్‌లతో కలిసి సందడి చేసింది. గ్లోబల్ ఐకాన్లందరూ ఒకే వేదికపై కనిపించడంతో మిలాన్ వీధులు కళకళలాడాయి.
ప్రియాంక చోప్రా ఫ్యాషన్ సెన్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. హాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అంతర్జాతీయ వేదికలపై భారతీయ వనిత సత్తా చాటుతోంది. ఈ పేల్ గ్రీన్ మరియు బ్లాక్ గౌన్ లుక్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్ రెడ్ కార్పెట్ అప్పియరెన్స్‌లుగా నిలిచిపోతాయి.