Prabhu deva: జీనీగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌.. ఆకట్టుకుంటోన్న మై డియర్‌ భూతం మోషన్‌ పోస్టర్‌..

డ్యాన్సర్‌గా, హీరోగా, డైరెక్టర్‌.. ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. తన అద్భుతమైన డ్యాన్స మూమెంట్స్‌తో 'ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌'గా పేరొందిన అతను ఇటీవల సల్మాన్‌తో

Prabhu deva: జీనీగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌.. ఆకట్టుకుంటోన్న  మై డియర్‌ భూతం మోషన్‌ పోస్టర్‌..

Updated on: Dec 13, 2021 | 9:32 PM

డ్యాన్సర్‌గా, హీరోగా, డైరెక్టర్‌.. ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. తన అద్భుతమైన డ్యాన్స మూమెంట్స్‌తో ‘ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌’గా పేరొందిన అతను ఇటీవల సల్మాన్‌తో ‘రాధే’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇది ఫ్లాప్‌గా నిలిచింది. అంతకుముందు సల్లూభాయ్‌తోనే రూపొందించిన ‘దబాంగ్‌3’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో నటుడిగా తన ప్రతిభను నిరూపించేందుకు మళ్లీ సిద్ధమవుతున్నాడు. వరుస సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో ‘మైడియార్ భూతం’ ఒకటి. ఇందులో భూతంగా పిల్లలను అలరించే పాత్రలో ప్రభుదేవా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ తాజాగా విడుదలైంది.

రాఘవన్‌ తెరకెక్కిస్తోన్న ‘మైడియర్‌ భూతం’లో ప్రభు పక్కన రమ్యా నంబీశన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డి.ఇమ్మాన్‌ స్వరాలు సమకూరుస్తు్న్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రిలీజైన ఫస్ట్‌లుక్‌లో జీనీ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు ప్రభుదేవా. అతని లుక్‌ నెట్టింట్లో వైరలవుతోంది. దీంతో పాటు ఆయన నటించిన ‘తేల్‌’ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ రెండింటితో పాటు ‘భగీరా’, ‘పొయ్‌కాల్‌ గుదిరై’, ‘ఫ్లాష్‌బ్యాక్‌’ తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభుదేవా.

Also Read:

Bangarraju Movie: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమైన బంగర్రాజు టీం.. రేపు మూడో సింగిల్‌ అప్డేట్‌..

Prabhas: దీపికకు అదిరిపోయే ఆతిథ్యమిచ్చిన ప్రభాస్‌.. రుచికరమైన వంటకాలతో స్పెషల్ ట్రీట్‌..

Virata Parvam: రానా బర్త్ డే స్పెషల్ అప్డేట్.. విరాటపర్వం నుంచి ‘ది వాయిస్ ఆఫ్ రవన్నా’.. ఎప్పుడంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us