
ఈ మధ్యన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ తో నే బాగా ఆసక్తి కలిగించిన సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ ఇందులో హీరోగా నటించాడు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, మహేశ్ మంజ్రేకర్, గరుడ రామ్, జయ ప్రకాష్, మురళీ శర్మ, బీఎన్ అవినాష్ , రిషభ్ సావ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా సుమారు రూ.100 భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న ఈ సినిమా తీరా ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. జులై 03న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ బంధం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ పరంగా పెద్దగా మెప్పించలేదనే విమర్శలు వచ్చాయ. అయితే ఇందులో వీఎఫ్ ఎక్స్, అద్భుతమైన విజువల్స్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. ముఖ్యంగా కొన్ని సీన్లు అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయన ప్రశంసలు వచ్చాయి. ఆ కారణంగానే నాగబంధం సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన నాగబంధం సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే థియేటర్లలో రిలీజైన కేవలం 21 రోజులకే నాగబంధం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
కాగా థియేట్రికల్ రిలీజ్ కు ముందే ‘నాగబంధం’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జులై 24) అర్ధరాత్రి నుంచే ఈ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. లుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. మరో ఐదు వారాల తర్వాత హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందించగా… జునైద్ కుమార్ అభే సంగీతాన్ని సమకూర్చారు. మరి థియేటర్లలో నాగ బంధం సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
#Nagabandham Now Streaming on @PrimeVideoIN @ViratKarrna @NabhaNatesh @Ishmenon @DakshaOfficial @anusuyakhasba @IamJagguBhai @GarudaRaam @highonkokken #Abhe #ursniresh @Nishithareddy85 @nikstudiosindia @AbhishekPicture pic.twitter.com/8wdwyIxx5D
— Cinema Mania (@ursniresh) July 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి