OTT Movie: ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోన్న సినిమా.. IMDBలో టాప్ రేటింగ్.. అబ్బాయిలు కచ్చితంగా చూడాల్సిన మూవీ

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం మరో విశేషం.

OTT Movie: ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోన్న సినిమా.. IMDBలో టాప్ రేటింగ్.. అబ్బాయిలు కచ్చితంగా చూడాల్సిన మూవీ
OTT Movie

Updated on: Jun 09, 2026 | 8:12 PM

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం, తమిళం, ఇంగ్లిష్.. ఇలా ప్రముఖ భాషలకు చెందిన మూవీస్, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలా గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ తమిళ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. దీంతో ఇప్పుడీ సినిమాను ఆడియెన్స్, అందులోనూ యూత్ ఎగబడి చూస్తున్నారు. అయితే అంతకు ముందు థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా కేవలం యావరేజ్ గా నిలిచిది. కానీ కాన్సెప్ట్ పరంగా ప్రశంసలు అందుకుంది. అలాగే ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ అందుకుంది. ఈ సినిమా కథ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు చాలా మందికి తమ కథలా అనిపిస్తోంది. అందుకే ఇప్పుడీ సినిమా ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోంది. స్టోరీలోకి వెళతే.. 30 ఏళ్లకు చేరువవుతోన్నసత్య అనే ఓ యువకుడు తన తన కెరీర్, భవిష్యత్తు గురించి అనేక సందేహాలతో జీవిస్తుంటాడు. కుటుంబ సభ్యుల అంచనాలు, ప్రశ్నలు, సమాజం నుంచి ఎదుయ్యే ఒత్తిడులతో మానసికంగా ఇబ్బంది పడుతుంటాడు. తరచూ ఉద్యోగాలు మారడం, అసలు తనకు ఏం చేయాలో తెలియకపోవడం తో ఆత్మవిశ్వాస లేమితో సతమతమవుతుంటాడు. ఇలాంటి సమయంలో సత్య జీవితంలోకి విజీ అనే ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ సత్యలో ఉన్న అనిశ్చితి, భయం వారి ప్రేమ బంధంపై ప్రతికూల ప్రభావితం చేస్తాయి.

 

ఇవి కూడా చదవండి

మరి సత్య-విజీల ప్రేమకథ ఏమైంది? పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాకుండా మన సంబంధాల్లో తరచూ వచ్చే భావోద్వేగాలను చాలా చక్కగా చూపించారు. అందుకే ఇది సినిమాలా కాకుండా నిజ జీవితానికి దగ్గరలా అనిపిస్తోంది. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు 29. రత్న కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో విధు, ప్రీతి అస్రాని జంటగా నటించారు. అలాగే బాలు మహేంద్రన్, , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. యూత్, అందులోనూ అబ్బాయిలు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇదని రివ్యూయర్లు పోస్టులు పెడుతున్నారు.

29 సినిమాపై ఒక నెటిజన్ రివ్యూ..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us