Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేము.. అయినా ఓటీటీలో తెగ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కారణంగా ఫ్యామిలీతో కలిసి అస్సుల చూడలేరు. అయినప్పటికీ ఈ మూవీ మాత్రం డిజిటల్ ప్లాట్ ఫాంలో టాప్ ట్రెండింగ్ జాబితాలో నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా గురించిచ తెలుసుకుందామా.

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేము.. అయినా ఓటీటీలో తెగ ట్రెండింగ్..
Udal Movie

Updated on: Jul 02, 2026 | 8:45 AM

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ట్రెండింగ్ అవుతున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుకుందామా. ఆ సినిమా విభిన్న కథాంశంతో తెరకెక్కించారు. అలాగే ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాలో ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం ఒక విభిన్నమైన , తీవ్రమైన నేరం చుట్టూ తిరుగుతుంది. కథలోని సస్పెన్స్, ఊహించని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు సీటు అంచున కూర్చోబెడతాయి. మలయాళ నటీనటుల సహజ సిద్ధమైన నటన, దర్శకుడి ప్రతిభ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా కూడా కథనం నెమ్మదించకుండా, ప్రతి సన్నివేశం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

ముఖ్యంగా నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలోని రహస్య వాతావరణాన్ని మరింతగా ఎలివేట్ చేశాయి. నేర పరిశోధన ఆధారంగా సాగే ఈ కథలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణ సినిమాలకు భిన్నంగా, క్లైమాక్స్ ఊహకందని విధంగా ఉండటం ఈ చిత్రం ప్రత్యేకత. మీకు సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ కథలు నచ్చితే, ఈ వీకెండ్ అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. భాషతో సంబంధం లేకుండా సబ్‌టైటిల్స్ లేదా డబ్బింగ్ సహాయంతో ఈ అద్భుతమైన సినిమాను వీక్షించి, ఒక సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఉడల్. 2022లో విడుదలైన ఒక హార్డ్‌కోర్ మలయాళ డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హాలీవుడ్ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘డోంట్ బ్రీత్’ ) తరహాలో సాగుతుంది. ‘ఉడల్’ అంటే మలయాళంలో ‘శరీరం’ అని అర్థం. కథ విషయానికి వస్తే.. షైనీ (దుర్గా కృష్ణ) అనే ఒక గృహిణి, తన పక్షవాతం వచ్చిన అత్తగారిని చూసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమె భర్త ఉద్యోగ నిమిత్తం ఊర్లో ఉండడు. ఇంట్లో చూపు, వినికిడి లోపం ఉన్న ముసలి మామగారు కుట్టిచన్ (ఇంద్రన్స్) మాత్రమే ఉంటారు. ఈ ఒంటరితనం, విసుగుదల వల్ల షైనీ తన కాలేజీ జూనియర్ కిరణ్ (ధ్యాన్ శ్రీనివాసన్)తో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఆ బంధనాల నుండి విముక్తి కోసం, అత్తగారిని చంపేయాలని కిరణ్‌తో కలిసి ప్లాన్ చేస్తుంది. వారు అనుకున్నట్లే అత్తను చంపేస్తారు, కానీ ఒక చిన్న తప్పు వల్ల ఆ విషయం మామగారైన కుట్టిచన్‌కు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ రాత్రి ఆ ఇంట్లో జరిగిన భీభత్సం, మామగారి నుండి తప్పించుకోవడానికి ఆ ఇద్దరు ప్రేమికులు పడిన నరకం ఈ సినిమా కథ.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us