
సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై తీవ్ర నిరాశను మిగిలిస్తాయి. కానీ అవే చిత్రాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతాయి. ముఖ్యంగా ఈ తరం కుర్రాళ్లకు తెగ కనెక్ట్ అవుతాయి. అలాగే భారీ బడ్జెట్ చిత్రాల రికార్డులను సైతం బద్దలు కొడతాయి.అలాంటి విలక్షణమైన, వినోదాత్మకమైన ఒక డార్క్ కామెడీ ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ అయిన జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు రావు బహదూర్. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత నెలలో భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ‘రావు బహదూర్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
కానీ ఆ సినిమా కథాంశం, మంచి రివ్యూస్ కారణంగా ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఈ చిత్రం చివరకు శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కొన్ని గంటల్లోనే భారతదేశంలోని టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానానికి చేరుకుంది. సుమారు 2 గంటల 46 నిమిషాల నిడివి గల ఈ సైకలాజికల్ డార్క్ కామెడీ చిత్రం ప్రేక్షకులు తప్పక చూడాల్సిన సినిమాగా మారుతోంది. ప్రేక్షకులే కాకుండా సినీ విమర్శకులు కూడా దీని కథను, నటనను ఎంతగానో ప్రశంసించారు. అంతేకాకుండా, ఈ సినిమా IMDbలో 8/10 రేటింగ్ పొందింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్ర కథ, ‘రామప్పారావు బహదూర్’ అనే ధనవంతుడు, వృద్ధుడు , తాగుబోతు అయిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రామప్ప మనసులో ఒక భయంకరమైన అనుమానం రేకెత్తినప్పుడు కథలో అసలైన మలుపు వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న తన కొడుకు తన సొంత కొడుకు కాదని, వివాహేతర సంతానమని అతను అనుమానిస్తాడు. ఈ అనుమానం అతని జీవితంలో సృష్టించే ఉత్కంఠ, గందరగోళం చూడదగ్గవి. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం అనే ఐదు భాషల్లో అందుబాటులో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..