
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ “పోచమ్మ” ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ‘మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది..’ అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన “పోచమ్మ” సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఆసక్తిరేపుతోంది. ఇంటెన్స్ మ్యూజిక్ బీజీఎం ఈ గ్లింప్స్ పై ఇన్ స్టంట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ ను మూవీగా థియేట్రికల్ రిలీజ్ చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డివైన్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన “పోచమ్మ” వెబ్ సిరీస్ ఆడియెన్స్ కు ఒక సరికొత్త ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ వెబ్ సిరీస్ ను శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు, స్ట్రీమింగ్ తేదీ త్వరలో ఆహా వెల్లడించనుంది.
ఇక ప్రజెంట్ ఆహాలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సర్కార్ సీజన్ 6 ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు ఎపిసోడ్స్ పూర్తి కాగా మూడో ఎపిసోడ్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: ప్రజెంట్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. అలాగే ప్రియ భవానీ శంకర్ నటించిన తమిళ్ బోల్డ్ మూవీ హాట్ స్పాట్ టూ మచ్ కూడా ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పిస్తోంది.
You can hide the sin.
You can bury the truth.
But you can’t silence the witness.
Presenting our new mystical thriller “POCHAMMA”.
Releasing this April 2026.
An aha Original.https://t.co/u3GqS2ToO1 pic.twitter.com/ByURJ5LJNu— ahavideoin (@ahavideoIN) March 9, 2026
Some sins fade.
Some sins follow you forever.
And this one has a witness.
The mystery begins today at 4 PM.#ahaoriginal pic.twitter.com/NfQNN8FQhm— ahavideoin (@ahavideoIN) March 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.