
దసరా కానుకగా ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో 20 కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. ద ట్రైటర్స్ (రియాలిటీ షో), ఆశా, కాగితం పడవలు, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి సినిమాలు, సిరీస్ లు ఈ వీకెండ్ లో ఓటీటీలోకి రానున్నాయి. అయితే వీటికంటే ముందే గురువారం (అక్టోబర్ 15) అర్ధరాత్రి నుంచే ఒక సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తమిళ థ్రిల్లర్ మూవీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేనప్పటికీ కేవలం కంటెంట్ తోనే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 9.3 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. తమిళనాడు రామేశ్వరంలోని ఓ ఊరిలో థవసి ముత్తు ఓ సామాన్య మత్స్యకారుడు. సముద్రంలో వేటకెళ్లిన ఆయనకు ఓ రోజు బంగారు లాకెట్ దొరుకుతుంది. దీంతో తన కుటుంబ కష్టాలు తీరిపోతాయని, అదృష్టం కలిసి వచ్చిందనుకుంటాడు. కానీ ఆ బంగారు లాకెట్టే ముత్తు ఫ్యామిలీకి ఓ పెద్ద శాపంగా మారుతుంది. స్థానిక పోలీసులకు ఈ విషయం తెలిసి థవసిని చోరీ కేసు కింద అరెస్ట్ చేస్తారు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడుతుంది. థవసిని కాపాడేందుకు లాయర్ కాంచన ఈ కేసు టేకప్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది. ఈ న్యాయ పోరాటంలోకాంచనకు ఎదురైన సవాళ్లేంటి? ఆ బంగారు లాకెట్ ఎవరిది? చివరకు ఈ కేసు నుంచి థవసీ ముత్తు ఎలా బయటపడ్డాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సూపర్ హిట్ సినిమా పేరు ‘ఎన్న విలై’ (Enna Vilai). ఇదొక తమిళ సినిమా. మలయాళంలో స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన సజీవ్ పూజర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. కురుణాస్ (థవసీ ముత్తు), నిమిషా సజయన్ (లాయర్ కాంచన), విజయలక్ష్మి వీరమణి, షాషా శివకుమార్, కమలేష్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా గురువారం నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఐఎమ్ డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీని కచ్చితంగా మీకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది. సో.. కాబట్టి మస్ట్ వాచ్.
Kadalkarai le kedachadhu ennamo orey oru pendant dhaan, aana adhukkaga Thavasi pay panna price? 👀😶 https://t.co/GWVKqq4JDS
— Netflix India South (@Netflix_INSouth) October 14, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.