
ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఎపిక్, మారెమ్మ వంటి తెలుగు సినిమాలతో పాటు ఆశా, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, ఖలీఫా, రిపోర్టింగ్ లైవ్ డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అయితే వీటికంటే ముందే ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక బైలింగ్వల్ మూవీ. కొన్ని రోజుల క్రితం తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి థియేటర్లలో విడుదలైంది. స్టార్ నటీనటులు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బరిలో కార్తీ నటించిన సర్దార్ 2 ఉన్నప్పటికీ ఈ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. అయితే ఇప్పుడీ బాక్సాఫీస్ సెన్సేషన్ ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (అక్టోబర్ 08) అర్ధరాత్రి నుంచే ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
తమిళ నటుడు సూరి, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సినిమా ‘మండాడి’ ఓటీటీలోకి వచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు,తమిళంతో సహా మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన మందాడి సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరిసారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో మండాడి సినిమాను మిస్ అయ్యారా? లేదా ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? మరెందుకు లేటు.. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
STREAMING ALERT 🚨
#Mandaadi (2026) Now Streaming On Netflix 🤩
– Sports Action Drama Film
Available In Hindi, Tamil, Telugu, Kannada & Malayalam Languages.
@sooriofficial #MandaadiOnNetflix https://t.co/V1HRUolC2r
— Cinema Abhi Hindi (@CinemaAbhiHindi) October 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.