OTT Movie: లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి.. అప్పుడే ఓటీటీలోకి శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ

కోర్టు హీరోయిన్ శ్రీదేవి నటించిన మొదటి తమిళ సినిమా ఇది. కొన్ని రోజుల క్రితమే తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి థియేటర్లలో రిలీజైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరు హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను బాగా చూశారు.

OTT Movie: లేడీస్ కాలేజీలో ఒక్కడే అబ్బాయి.. అప్పుడే ఓటీటీలోకి శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
OTT Movie

Updated on: Nov 07, 2026 | 10:03 PM

‘కోర్ట్’ సినిమాతో సూపర్ ఫేమ్ సంపాదించుకుంది శ్రీదేవి ఆపళ్ల. ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసుకునే ఆమెకు డైరెక్టర్ పట్టు బట్టి మరీ ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, అభినయం, ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీదేవి. ముఖ్యంగా కుర్రాళ్లకు ఫేవరెట్ గా మారిపోయింది. కాగా శ్రీదేవి తమిళంలో ఎంట్రీకి ఇచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘హైకూ’. శ్రీదేవితో పాటు ఏగన్, ఫెమినా జార్జ్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్ 23న తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైన హైకూ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘హైకూ’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు సంయుక్తంగా ‘కోర్ట్’ సినిమాను నిర్మించారు. శ్రీదేవి, ఏగన్‌లతో పాటు మైమ్ గోపి, ఫెమినా జార్జ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ‘హైకూ’ సినిమా కథ విషయానికి వస్తే.. మనోహర్ (ఏగన్) తన కాలేజ్ ఫ్రెండ్స్‌తో గొడవపడి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత అతను కొన్ని కారణాలతో ఒక ఉమెన్స్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. రెండు వేల మంది అమ్మాయిలు ఉన్న ఆ కాలేజీలో అతనొక్కడే అబ్బాయి. అక్కడ పవళకోడి (శ్రీదేవి) అనే అమ్మాయితో మనోహర్‌కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. కులమతాలు, హోదా పట్టింపులు ఎక్కువైనా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఇంతలోనే కాలేజీ పూర్తయ్యాక కోయంబత్తూరు నుంచి చెన్నైకి ఉద్యోగం కోసం వెళ్తారు. ఈ టైంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి. దీంతో వకుళకుడి మరో పెళ్లి చేసుకుంటుంది. మరోవైపు మనోహర్ కూడా ఓ మంచి సంస్థలో జాబ్ తెచ్చుకుని ఆఫీస్ కొలీగ్ నివేదా (ఫెమినా జార్జ్) ప్రేమిస్తాడు. అసలు మనో, వకుళా విడిపోవడానికి కారణం ఏంటి? కుడి మరో పెళ్లి ఎందుకు చేసుకుంది? నివేదా మనో కూడా ఎందుకు విడిపోయారు? అసలు ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే హైకూ సినిమా చూడాల్సిందే.

హైకూ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us