
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఏప్రిల్ 03) కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అలాగే ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక లేటెస్ట్ తెలుగు సినిమా ఉంది. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.. క్రైమ్ బ్యూరోలో రిపోర్టర్‌గా వర్క్ చేయాలనేది హీరో జై కల. కానీ అవకాశాలు రావు. దీంతో యాడ్స్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తుంటాడు. ఎవరైనా చనిపోయినట్లు తెలిస్తే వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి చనిపోయిన వాళ్ల గురించి రహస్యంగా వివరాలు తెలుసుకుంటుంటాడు. వాళ్ల కుటుంబ సభ్యుల దగ్గర తన గొప్పలు చెప్పుకొని యాడ్స్ సేకరిస్తుంటాడు. అలా ఒకసారి అచ్యుత్ రావు అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళతాడు. అంతలోనే మరో వ్యక్తి సేమ్ అచ్యుత్ రావు లానే చనిపోతాడు.
ఈ వరుస మరణాలు నగరంలో కలకలం రేపుతాయి. ఈ చావుల వెనక ఓ అంతుచిక్కని మిస్టరీ ఉంటుందని హీరో తెలుసుకుంటాడు. ఇదే క్రమంలో ఐపీఎస్ అధికారిణి సీతా పరశురాం ఈ మర్డర్స్ మిస్టరీని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతుంది. మరి ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఆ క్రిమినల్స్ ను ఎలా కనిపెట్టాడు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
టాలీవుడ్ లో ఎంటర్ టైన్మెంట్ కింగ్ గా పేరొందిన శ్రీ విష్ణు తన రొటీన్ కు భిన్నంగా నటించిన సినిమా మృత్యుంజయ్. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇందులో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు నటించారు. మార్చి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
He’s not a cop, not a hero. Nijanni bayatapettalani sahanam kolipoyina oka common man 😎🫡 pic.twitter.com/lwxHRawCvt
— Netflix India South (@Netflix_INSouth) April 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.