Squid Game: 10 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయిన స్క్విడ్‌ గేమ్‌ ముద్దుగుమ్మ.. ఎందుకంటే..

|

Dec 26, 2021 | 1:13 PM

స్క్విడ్‌ గేమ్‌..సినీ ప్రేక్షకులకు ఈ సిరీస్‌ గురించి ప్రత్యేక పరిచయం లేదు. కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కొరియన్ వెబ్‌సిరీస్‌ ఓటీటీలోనే అత్యధికంగా వ్యూస్ సొంతం చేసుకున్న షోగా మంచి గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌తో పాటు తె

Squid Game: 10 రోజుల్లో 4 కిలోలు తగ్గిపోయిన స్క్విడ్‌ గేమ్‌  ముద్దుగుమ్మ.. ఎందుకంటే..
Follow us on

స్క్విడ్‌ గేమ్‌..సినీ ప్రేక్షకులకు ఈ సిరీస్‌ గురించి ప్రత్యేక పరిచయం లేదు. కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ కొరియన్ వెబ్‌సిరీస్‌ ఓటీటీలోనే అత్యధికంగా వ్యూస్ సొంతం చేసుకున్న షోగా మంచి గుర్తింపు పొందింది. ఈ సిరీస్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళ, మలయాళ వంటి ప్రాంతీయ భాషల్లోకి కూడా దీనిని అనువదించారు. ప్రస్తుతం వాటి ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే పనిలో ఉంది చిత్రబృందం. ఇందులో భాగంగానే పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. కాగా ‘స్క్విడ్‌ గేమ్‌’ లో కొరియన్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ హోయెన్ జంగ్ ఓ కీలకపాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సిరీస్‌ ప్రమోషన్లలోనూ విస్తృతంగా పాల్గొంటుందీ ముద్దుగుమ్మ. ఈక్రమంలోనే జంగ్ కేవలం 10 రోజుల్లో సుమారు 4 కేజీల బరువు తగ్గిందంట.

దుస్తులు వదులైపోయాయి..
దీనిపై స్పందించిన ఆమె.. ‘ ‘స్క్విడ్‌ గేమ్‌’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో బాగా తిరిగాం. ఈ సమయంలో తినడానికి మాకు సమయమే దొరకలేదు. దీంతో బాగా బరువు తగ్గిపోయాను. అక్కడికి వెళ్లేముందు నాకు బాగా ఫిట్ అయ్యే దుస్తులు వెనక్కి వచ్చేటప్పుడు చాలా వదులైపోయాయి’ అని వాపోయింది. కాగా సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేస్తోన్న ఫొటోల్లో మరీ బక్కచిక్కిపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది నెటిజన్లు ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు. ‘మిమ్మల్ని అలా బ్లాక్‌ డ్రెస్‌లో అలా చూడడం నాకు ఆందోళన కలిగిస్తోంది’, ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి’, ‘ సరైన ఆహారం తీసుకోండి’ అని కామెంట్లు పెడుతున్నారు.

 

Also Read:

Merry Christmas: విజయ్‌ సేతుపతితో జోడీ కట్టనున్న కత్రినా.. డైరెక్టర్‌ ఎవరంటే..

Singer Sayali kamble: స్నేహితునితో ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ ఎంగేజ్‌మెంట్‌.. సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌..

Padmaja Konidela Birthday: సతీమణి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన మెగా బ్రదర్‌.. నెట్టింట్లో ఫొటోలు వైరల్‌ ..