
గతేదాది ఓటీటీలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. వాస్తవికతకు దగ్గరగా ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ను చూసిన నెటిజన్లు తమ పాజిటివ్ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఓ అర్ధరాత్రి ఇద్దరు పోలీసుల జీవితాలను ఎలా మార్చేసిందన్నది ఈ సినిమా కథ. ఎస్ఐ ఝాన్సీ , కానిస్టేబుల్ హరీష్ ఒక రోజు రాత్రి రొటీన్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఒక జర్నలిస్ట్ అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో పోలీసుల జీవితం పూర్తిగా తలకిందులు అవుతుంది. ఇద్దరు పోలీసులు సస్పెండ్ అవుతారు. మరి ఆ హత్య కేసు దర్యాప్తులో వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కున్న పోలీసులు దాన్నుంచి ఎలా బయటపడ్డారన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
పోలీసుల వ్యక్తిగత జీవితం, విధి నిర్వహణలో వారు పడే ఇబ్బందులు, మానసిక సంఘర్షణను చక్కగా చూపించిన సినిమా పాతి రాత్రి. అంటే తెలుగులో అర్ధరాత్రి. మంజుమ్మల్ బాయ్స్, కూలీ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన షౌబిన్ షాహిర్, నవ్య నాయర్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సన్నీ వేన్, ఆన్ అగస్టిన్, శబరీష్ వర్మ, ఇంద్రన్స్, హరిశ్రీ అశోకన్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది. అయితే కేవలం మలయాళం వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
#paathirathri
Such a letdown from a strong crew. Poor writing, underwhelming performances, flat execution & zero thrills.
ശോകം പടം 🥴 pic.twitter.com/tg4KlFGeAT— ABHI (@_abhi__jith) February 24, 2026
#Paathirathri – REVIEW#Paathirathri Works As A Night-Driven Crime Drama🌙🔍, Focusing More On Human Behaviour And Moral Confusion Than Typical Thriller Twists🙂. #SoubinShahir Delivers A Natural & Grounded Performance👏🔥, portraying a tired yet alert cop with believable… pic.twitter.com/BUvLpd5voy
— Cinemy (@HdUpdatesMovie1) February 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.