
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ గత వారమే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్, ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ చార్టులలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ‘గోల్డెన్ ఆరోస్’ స్క్వాడ్రన్ సభ్యుల ప్రయాణాన్ని ఈ సిరీస్ లో చూపించారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. భారత, పాకిస్తాన్ సైన్యాల మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం, అందులో వెలుగులోకి రాని చాలా విషయాలను ఈ కొత్త వెబ్ సిరీస్ లో చూపించారు. ముఖ్యంగా భారత వైమానిక దళం శౌర్యాన్ని, పరాక్రమాన్ని, అలాగే దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులైన సైనికుల జీవితాలను ఈ సిరీస్ లో ఎంతో ఎమోషనల్ గా చూపించారు. ఈ వెబ్ సిరీస్‌లో జిమ్మీ షెర్గిల్, సిద్ధార్థ్, అభయ్ వర్మ, దియా మీర్జా, మహేష్ మంజ్రేకర్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ అప్పటి నుంచి సానుకూల స్పందనలను అందుకుంటోంది.
‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్ పైలట్ అధికారుల అంతర్గత సంఘర్షణలను కూడా హైలైట్ చేసింది. పటియాలా, పటౌడీ, నోయిడా, న్యూఢిల్లీ, ముంబై, మనాలి, కీలాంగ్, గ్వాలియర్, గురుగ్రామ్, చండీగఢ్, బికనీర్‌తో సహా 11 నగరాల్లో 115 రోజుల పాటు ఈ సిరీస్‌ను చిత్రీకరించారు. ఈ సిరీస్ నిర్మాణంలో 200 మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే 4000 మంది రోజువారీ కూలీలు పాల్గొన్నారు. ఈ సిరీస్ కోసం నెట్‌ఫ్లిక్స్ 15 భారతీయ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
🚨 Just completed #Operationsafedsagar on the @netflix..
Very watchable and operation Safed Sagar had the scale,emotion and the story of a real hero.
But Siddharth as Squadron Leader Ajay Ahuja felt badly miscasted. The performance lacked the command and the intensity the role… pic.twitter.com/63X6awbkyl
— Hindutva Horizon (@DrInViNcible12) August 10, 2026
కాగా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ వెబ్ సిరీస్ ను చూసి పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ సిరీస్‌ను ప్రశంసించారు. ఒరిజినల్ హిందీ వెర్షన్ తో పాటు తెలుగు తదితర ప్రధాన భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి