OTT Movie: ఆడవాళ్లను చంపి తాళి మాత్రమే తీసుకెళ్లే కిల్లర్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. ఇప్పుడు తెలుగులోనూ..

1999లో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒరిజినల్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, లేటెస్ట్ గా తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

OTT Movie: ఆడవాళ్లను చంపి తాళి మాత్రమే తీసుకెళ్లే కిల్లర్.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. ఇప్పుడు తెలుగులోనూ..
OTT Movie

Updated on: Mar 29, 2026 | 6:39 PM

ఈ మధ్యన వాస్తవ సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. 1999లో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. తిరువళ్లూరుకు దగ్గర్లో ఉన్న పొడతూర్‌‌పేటలో 1995లో వరుసగా ఒకే ప్యాట్రెన్‌‌లో వరుస హత్యలు జరుగుతాయి. అయితే అవి దోపిడీ కోసం చేసిన హత్యలు కాదు. ఒంటరిగా ఉండే భార్య, భర్తలను మాత్రమే టార్గెట్ గా చేసుకున్న కిల్లర్స్‌‌‌‌ వారిని హత్య చేసి మగవారి నడుము గొలుసు (మొలతాడు), ఆడవారి మంగళసూత్రం మాత్రమే తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో రక్తంతో ‘‘?’’(ప్రశ్నార్థకం గుర్తు) రాసి వెళ్లిపోతారు. దీంతో ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు ఎస్‌‌ఐ లక్ష్మి రంగంలోకి దిగుతుంది. దర్యాప్తు కోసం వాలంటరీ రిటైర్‌‌మెంట్ కోసం అప్లై చేసిన ఓ సీనియర్ సబ్‌‌ఇన్‌‌స్పెక్టర్ హెల్ప్ తీసుకుంటుంది. ఇద్దరూ కలిసి ఈ హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. సీరియల్ కిల్లర్స్ మొత్తం 77 హత్యలు చేసినట్లు తెలుసుకుంటారు. మరి ఆ కిల్లర్స్ ఎవరు? అసలు వారు ఎందుకు ఇలా చేస్తున్నారు? పోలీసులు వారిని పట్టుకున్నారా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ సిరీస్ చూడాల్సిందే.

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ తమిళ వెబ్ సిరీస్ ‘తడయం’. నవీన్ కుమార్ పళనివేల్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అజయ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. శివదా, సుందర్ పాండియన్, రాజ్ తిరందాస్, మున్నార్ రమేశ్ ఇతర పాత్రల్లో మెరిశారు. ఫిబ్రవరి 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే లేటెస్ట్ గా ‘తడయం’ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే తడయం వెబ్ సిరీస్ మీకు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు తెలుగు లోనూ తడయం.. జీ 5 ఓటీటీలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us