Irumudi OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన ‘ఇరుముడి’.. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ థియేటర్లలో సంచలన విజయం సాధించింది. రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Irumudi OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన ఇరుముడి.. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Irumudi Movie

Updated on: Sep 18, 2026 | 6:35 AM

మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమా సంచలన విజయం సాధించింది. ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటికే ఈ ఇరుముడి సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. కాగా థియేటర్లలో ఈ సినిమా రిలీజై దాదాపు నెల రోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ రవితేజ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. చాలా చోట్ల గుంపులు గుంపులుగా ట్రాక్టర్లలో వెళ్లి మరీ ఈ సినిమాను చూసేస్తున్నారు. అయితే ఇలా థియేటర్లలో ఉండగానే ఇరుముడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 18) అర్ధరాత్రి నుంచే ఇరుముడి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇరుముడి సినిమా అందుబాటులోకి వచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, కూతురిగా బేబీ నక్షత్ర క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలోని పాటలు ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి సాంగ్ థియేటర్లలో వచ్చినప్పుడు ఆడియెన్స్ పూలు చల్లి, హారతులు పట్టారు. ఇక సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్ , ఇన్ స్టా వీడియోలే దర్శనమిస్తున్నాయి. మరి థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఇరుముడి ఓటీటీలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us