
రణ్ వీర్ సింగ్, ఆధిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురంధర్ 2) మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలై సుమారు ఏడు వారాలు గడిచాయి. అయినా ధురంధర్ 2 జోరు తగ్గలేదు. థియేటర్లలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 1900కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ధురంధర్ 2 సినిమా స్ట్రీమింగ్ ఆలస్యానికి ఒక కారణముందట. ఈ మూవీ క్లైమాక్స్‌లో ‘తిర్చి టోపీవాలే’ సాంగ్ ను రీమిక్స్ చేసి ‘రంగ్ దే లాల్’ పేరుతో వాడారు. దీంతో ఈ సాంగ్ ఉన్న ఉన్న ‘త్రిదేవ్’ సినిమా దర్శకుడు, నిర్మాత రాజీవ్ రాయ్ తన అనుమతి లేకుండా పాటను వాడుకున్నారంటూ ధురంధర్ 2 నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. అయితే ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ వివాదం సమసిపోయే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మరికొద్ది రోజుల్లో ధురంధర్ 2 స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.
. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 నుంచి 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ లెక్కన ధురంధర్ 2 సినిమా మే 14 నాటికి థియేటర్లలో రిలీజై ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంటుంది. దీనిని బట్టి చూస్తే మే రెండో వారంలో లేదా నెలాఖరులోగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయనుంది. ధురంధర్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మే 15 లేదా 22 తేదీల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు. ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు.
#Dhurandhar2 49 Days Worldwide Collection ₹1940 Crore 🔥🔥🔥
All Time Industry Record 🔥🔥#Dhurandhar2TheRevenge #RanveerSingh pic.twitter.com/sahG3X2VBH
— Asian Box Office (@AsianBoxOffice) May 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.