Shamshera: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టిన రణ్‌బీర్‌ సినిమా.. షంషేరా తెలుగు వెర్షన్‌ను ఎక్కడ చూడొచ్చంటే?

Shamshera OTT Release: బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా నటించిన చిత్రం షంషేరా. సంజు సినిమా అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత రణ్‌బీర్‌ నటించిన క్రేజీ ప్రాజెక్టు ఇది. వాణీకపూర్‌ హీరోయిన్‌గా కనిపించగా,

Shamshera: అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టిన రణ్‌బీర్‌ సినిమా.. షంషేరా తెలుగు వెర్షన్‌ను ఎక్కడ చూడొచ్చంటే?
Shamshera

Updated on: Aug 19, 2022 | 3:09 PM

Shamshera OTT Release: బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా నటించిన చిత్రం షంషేరా. సంజు సినిమా అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత రణ్‌బీర్‌ నటించిన క్రేజీ ప్రాజెక్టు ఇది. వాణీకపూర్‌ హీరోయిన్‌గా కనిపించగా, కేజీఎఫ్‌తో సౌత్‌ ఇండస్ట్రీని ఆకట్టుకున్న సంజయ్‌దత్‌ కీ రోల్‌లో నటించాడు. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించారు. పిరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ జులై 22న విడుదలైంది. అయితే ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెల గడవకముందే డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు (ఆగస్టు 19) నుంచి స్త్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.

కాగా హీరోయిన్‌ వాణీకపూర్‌ కూడా షంషేరా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేస్తూ ‘ధైర్యసాహసాలు, సంకల్పం ఉన్న వీరోచిత కథ. ఇప్పుడే ప్రైమ్ వీడియోలో చూడండి’ అంటూ రాసుకొచ్చింది. కాగా రణ్‌బీర్ ఆశలన్నీ రాబోయే చిత్రం బ్రహ్మస్త్రం పైనే ఉన్నాయి. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అలియాభట్ హీరోయిన్‌గా నటిస్తోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. అక్కినేని నాగర్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us