OTT Movie: ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ మూవీ.. ఒంటరిగా మాత్రం చూడొద్దు

ఈ వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఓటీటీలోని ఈ మూవీ మీకు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా, కథనాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.

OTT Movie: ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ మూవీ.. ఒంటరిగా మాత్రం చూడొద్దు
OTT Movie

Updated on: Oct 08, 2026 | 9:30 PM

ప్రస్తుతం క్రైమ్, కామెడీ, యాక్షన్ చిత్రాలకు ఎంత క్రేజ్ ఉందో.. హార్ట్ బీట్ పెంచే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు కూడా అంతే ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఆడకపోయినా ఈ జానర్ సినిమాలు ఓటీటీలో దుమ్మురేపుతుంటాయి. అలా ఆడియెన్స్ ను భయపెడుతూ, ఉత్కంఠ రేకెత్తించే హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సేమ్ ఈ జానర్ కు చెందినదే. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు మంచి రేటింగ్ ఉండడం విశేషం. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే.. మహెక్ (రాధికా ఆప్టే) అనే ఒక అమ్మాయి చుట్టూ ఈ స్టోరీ తిరగుతుంది. మహెక్ ప్రతిభావంతమైన ఆర్టిస్ట్. ఒకరోజు రాత్రి పార్టీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్ మహెక్‌పై లైంగిక దాడికి పాల్పడుతాడు. ఈ ఘటన తర్వాత మహెక్ తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతుంది. నలుగురిలోకి వెళ్లాలన్నా భయపడుతుంటుంది. చివరకు గది దాటి బయటకు రావడానికి కూడా ఆమె వణికిపోతుంది. దీంతో ఈ భయం నుంచి బయటపడటానికి మహెక్ ఒక కొత్త అపార్ట్‌మెంట్‌కు మకాం మారుస్తుంది. అయితే అక్కడ ఆమెకు మరో పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ ప్లాట్‌లో అంతకుముందు నివసించిన ‘జియా’ అనే యువతి హఠాత్తుగా మాయమైనట్లు మహెక్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత గదిలో వింత శబ్దాలు వినపడటం, భయంకరమైన దృశ్యాలు కనిపించడం మొదలవుతాయి. మరి జియా ఎవరు? ఆమె ఎలా అదృశ్యమైంది? చివరికి మహెక్ తన సమస్యలను ఎలా పరిష్కరించుకుందన్నదే ఈ సినిమా మిగతా కథ.

ఓటీటీలో ఉన్న ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమాలో ఫోబియా కూడా ఒకటి. రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. దర్శకుడు పవన్ కృపలానీ తెరెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో అమృత బాగ్చీ, నివేదితా భట్టాచార్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఐఎమ్‌డీబీలో (IMDb)లో 6.8 రేటింగ్ ఉన్న ఫోబియా సినిమాకు చాలా ఓటీటీల్లో ఉంది. ప్రధానంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్, ఆపిల్ టీవీ ప్లస్‌లలో కూడా ఫోబియా అందుబాటులో ఉంది. వీకెండ్‌లో మంచి థ్రిల్లింగ్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఓటీటీలో చూసేందుకు’ఫోబియా’ సినిమా బెస్ట్ ఆప్షన్. అయితే వీక్ హార్ట్ పీపుల్ ఈ సినిమాకు దూరంగా ఉండడం మంచిది.

ఫోబియా సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us