
ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లు అయినా, ఓటీటీలైనా ఇప్పుడీ జానర్ సినిమాలదే హవార. మరీ ముఖ్యంగా ఓటీటీలో ఈ రకమైన సినిమాలకే ఎక్కువగా ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందినదే. ఇది ఒక కోలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఇక ఓటీటీలో అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. ప్రధాన భాషలన్నింటిలోనూ స్ట్రీమింగ్ కు రావడంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఓటీటీల్లో రికార్డు స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా స్టోరీ కూడా చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కేరళలోని తిరుచ్చి నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. నగరంలో ఒక ఏరియాలో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులకి ఒక అడవిలో అమ్మాయి శవం కనిపిస్తుంది. దానిని చూసిన తర్వాత ఇది ఇంతకు ముందు జరిగిన హత్యలా ఉందని కానిస్టేబుల్ పై అధికారికి చెప్తాడు. దీంతో ఈ కేస్ ను స్పెషల్ బ్రాంచ్ కి బదీలీ చేస్తారు. స్పెషల్ అధికారిగా లోక్ నాథన్, అతనికి అసిస్టెంట్ గా కొత్తగా డ్యూటీలోకి జాయిన్ అయిన ప్రకాశ్ ను నియమిస్తారు. వీరిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే నగరంలో మరికొన్ని హత్యలు జరుగుతాయి. ఇక ఈ మూవీ ప్రీ క్లైమాక్స్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సైకో కిల్లర్ దొరికిపోయాడనుకునేలోపే మరొక ట్విస్ట్ ఇచ్చి ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ఇచ్చాడు ఆడియెన్స్. మరి ఈ హత్యలన్నింటికి కెనడీకి సంబంధమేంటి? ఈ వరుస హత్యలు చేస్తుందెవరనేది పోలీసులు కనిపెట్టారా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో ఉన్న ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల జాబితా తీస్తే కచ్చితంగా ‘పోర్ తొళిల్’ ఉంటుంది. విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఆర్. శరత్‌కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్, నిజల్ గల్ రవి, శరత్ బాబు, పిఎల్ తేనప్పన్, ఓఏకే సుందర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విఘ్నేష్ రాజా మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను ఓటీటీలో మస్ట్ వాచ్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం పోర్ తొళిల్ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవారికి ‘పోర్ తొళిల్’ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.