
యంగ్ హీరో విక్రాంత్, అందాల తార మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం స్పార్క్. ది లైఫ్ అనేది మూవీ క్యాప్షన్. ఇందులో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించాడు విక్రాంత్. అంతేకాదు నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించాడు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలోనే రుక్సార్ థిల్లాన్ సెకెండ్ హీరోయిన్గా మెరిసింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తిగా ఆసక్తిగా ఉండడం, గట్టిగా ప్రమోషన్లు నిర్వహించడంతో స్పార్క్ మూవీపై ఆసక్తి పెరిగింది. అయితే నవంబర్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కథా కథనాలు ఆసక్తిగా ఉన్నా అందుకు తగ్గ ప్రజెంటేషన్ లేకపోవడంతో పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన స్పార్క్ మూవీ అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మెహ్రీన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిందీ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లోనూ స్పార్క్ మూవీ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చేసింది.
హృదయం, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు పాటలు అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ స్పార్క్ సినిమాకు స్వరాలు అందించడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. ఈ హత్యలకు ఆర్య (విక్రాంత్) తో సంబంధముందని అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న లేఖ(మెహరీన్) భావిస్తోంది. మరి అసలు ఆర్య ఎవరు? అతను ప్రేమించిన అనన్య (రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? మనిషి మెదడును కంట్రోల్ చేసే ప్రయోగాలు చేసే ఓ డాక్టర్ కుట్రలను ఆర్య ఎలా వెలుగులోకి తెచ్చాడన్నదే స్పార్క్ మూవీ కథ. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? అయితే స్పార్క్‌పై ఓ లుక్కేయవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..