Cinema OTT: మలయాళంలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ..

ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తు్న్నారు. నిత్యం కొత్త కొత్త చిత్రాలు, విభిన్న కంటెంట్ వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. తెలుగు కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ రాబోతుంది.

Cinema OTT: మలయాళంలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ..
Prakambanam Movie

Updated on: Mar 14, 2026 | 8:13 AM

మలయాళీ సినిమాలకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, హారర్, మిస్టరీ, రొమాంటిక్ జానర్ చిత్రాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ హారర్ కామెడీ సినిమా ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఆ మూవీ పేరు ప్రకంపనం (Prakambanam). యంగ్ యాక్టర్స్ గణపతి, సాగర్ సూర్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. హారర్, భయపెట్టే సీన్లతోపాటు కడుపుబ్బా నవ్వించే సీన్స్ సైతం ఉన్నాయి. ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 కొనుగోలు చేసింది. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలై దాదాపు ఆరు వారాలు దాటింది. ఇప్పుడు మార్చి చివరి నెలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు విజేష్ పనత్తూరు దర్శకత్వం వహించారు. మలయాళీ హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

కథ విషయానికి వస్తే.. ముగ్గురు జాలీగా తిరిగే కాలేజీ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఎటువంటి బాధ్యత లేకుండా లైఫ్ ఎంజాయ్ చేసే వీరి జీవితాల్లో ఒక అనుహ్యమైన సంఘటన ఎదురవుతుంది. వారిలో ఒకరి శరీరంలోకి ఒక బామ్మ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లు పడే ఇబ్బందులు, ఆ ఆత్మ చేసే హంగామా ప్రేక్షకులను ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

Follow Us