OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
ప్రస్తుతం థియేటర్లలో 'పుష్ప 2' హవా నడుస్తోంది. దీంతో ఈ వారం కూడా సిల్వర్ స్క్రీన్‌పై తెలుగు సినిమాలేమీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థియేటర్లలో పుష్ప 2 సినిమా హంగామా నడుస్తోంది. కాబట్టి క్రిస్ మస్ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవచ్చు. ఇక ఈ వారం థియేటర్లలో సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే విడుదలవుతోంది. మరోవైపు ఓటీటీలో మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ ల సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ వారం మొత్తమ్మీద సుమారు 30 కు పైగా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో మలయాళ థ్రిల్లర్ బొగెన్ విల్లా ఆసక్తి రేపుతోంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే ‘సింగం ఎగైన్’, ”డిస్పాచ్’ సినిమాలతో పాటు ‘హరికథ’ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా చూడదగినవే. మరి డిసెంబర్
రెండో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో ఒక లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 09
ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 09
జెమియా ఫాక్స్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 10
పోలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
రగ్డ్ రగ్బీ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
మకల్యాస్ వాయిస్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 11
మారియా (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 11
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
ద ఆడిటర్స్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ సినిమా) – డిసెంబర్ 12
లా పల్మా (నార్వేజియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
నో గుడ్ డీడ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
1992 (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
క్యారీ ఆన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 13
డిజాస్టర్ హాలీడే (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబర్ 13
మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 14
అమెజాన్ ప్రైమ్ వీడియో
సీక్రెట్ లెవల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
సింగం ఎగైన్ (హిందీ సినిమా) – డిసెంబర్ 12
బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 11
ఎల్టన్ జాన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 13
హరికథ (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
ఇన్విజబుల్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
బూకీ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
పారిస్ & నికోల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
బుక్ మై షో
డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ సినిమా) – డిసెంబరు 10
ద క్రో (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 10
సోనీ లివ్
బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ సినిమా ) – డిసెంబర్ 13