Journey Of Love 18 Plus OTT: ఓటీటీలోకి వచ్చిన మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవల మలయాళ సినిమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మలయాళ దర్శక నిర్మాతలు తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఓటీటీలోనూ మలయాళ సినిమాలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. గతంలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులోకి అనువదించి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు

Journey Of Love 18 Plus OTT: ఓటీటీలోకి వచ్చిన మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Journey Of Love 18 Plus Movie

Updated on: Sep 18, 2023 | 5:34 PM

ఇటీవల మలయాళ సినిమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మలయాళ దర్శక నిర్మాతలు తమ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఇక ఓటీటీలోనూ మలయాళ సినిమాలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. గతంలో రిలీజై సూపర్‌హిట్‌గా నిలిచిన పలు సినిమాలను తెలుగులోకి అనువదించి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. అలా ఇటీవల మలయాళం నుంచి వచ్చిన 2018, నెయ్‌మార్‌, పద్మిని సినిమాలు ఓటీటీలో సూపర్‌ రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి. ఇప్పుడు మరో మలయాళ సూపర్‌హిట్ సినిమా తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 7వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టింది. అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌ ఈ సినిమాకు బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇప్పుడీ లవ్‌ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ సోనీ లివ్‌లో ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’ స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ ఈ టీనేజ్‌ లవ్‌ స్టోరీ అందుబాటులో ఉంది.

నేటి యూత్ ఆలోచనలకు తగ్గట్టుగా..

అరుణ్ డి. జోస్ తెరకెక్కించిన జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ సినిమాలో నస్లెన్ కె. గఫూర్, మాథ్యూ థామస్, మీనాక్షి దినేష్, నిఖిల విమల్, బిను పప్పు, రాజేష్ మాధవన్ తదితరులు నటించారు. వీరంతా మలయాళ నటులే. తెలుగు ఆడియెన్స్‌కు వీరంత కొత్తగా కనిపించవచ్చు. అయితే ఈ సినిమాలో కథ, స్క్రీన్‌ప్లేనే కీ రోల్‌ పోషించాయి. నేటి యూత్‌ ఆలోచనలకు తగ్గట్టుగా ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించారు. ఫలూదా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనుమోద్ బోస్ ఈ ప్రేమకథను నిర్మించారు. క్రిస్టో జేవియర్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

సోనిలివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్..

జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ మూవీ ట్రైలర్..

టీనేజ్ లవ్ స్టోరీగా ‘జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్’

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us