OTT Movie: బడి పిల్లలకు వింత శాపం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ మూవీనే. భయపెట్టే సీన్లు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ మూవీ గురువారం (మార్చి 05) ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: బడి పిల్లలకు వింత శాపం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
OTT movie

Updated on: Mar 05, 2026 | 7:38 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల సందడి మొదలైంది. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ లో సందడి చేస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతి:, విత్ లవ్, దేవగుడి వంటి సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు ఇదే కోవలో గురువారం (మార్చి 05) కూడా మరో కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదొక హరర్ థ్రిల్లర్ మూవీ. శాపాలు, ఆత్మల నేపథ్యంలో సాగే ఈ మూవీకి ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఒక హైస్కూల్‌లో చదివే ఆరుగురు విద్యార్థులు అనుకోకుండా ఒక వింత శాపంలో చిక్కుకుంటారు. ప్రతిరోజూ అర్థరాత్రి వారు తిరిగి తమ స్కూల్ లైబ్రరీలో నిద్రలేస్తారు. అక్కడ ఒక చిన్నారి ఆత్మ వారిని వేటాడి చంపేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చనిపోయిన విద్యార్థులు మళ్లీ నిన్నటి రోజునే నిద్రలేస్తారు.

ఈ శాపం నుంచి విముక్తి కలగాలంటే.. స్కూల్ ఆవరణలో పాతి పెట్టిన ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ ను వెతికి శవ పేటికలో అమర్చాలి. అలా ఆ డెడ్ బాడీ పార్ట్స్ కలిపితేనే వారికి విముక్తి కలుగుతుంది. మరి ఆ ఆరుగురు స్కూల్ విద్యార్థులు శాపం నుంచి విముక్తి పొందారా? అసలు బాడీ పార్ట్స్ పెట్టాల్సిన అమ్మాయి ఎవరు? ఈ స్కూల్ పిల్లలకే అలా ఎందుకు జరుగుతుంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సీన్లు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘రీ/మెంబర్: ది లాస్ట్ నైట్’ (Re/Member: The Last Night). ఇదొక జపనీస్ హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కేవలం జపనీస్ లాంగ్వేజ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us