OTT Movie: హాస్టల్‌లో అమ్మాయిల మిస్సింగ్.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు

ఓటీటీ ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ అందించేందుకు మరో హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. బుధవారం (అక్టోబర్ 28) అర్ధరాత్రి నుంచే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగానే చూడొచ్చు.

OTT Movie: హాస్టల్‌లో అమ్మాయిల మిస్సింగ్.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త హారర్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడొద్దు
OTT Movie

Updated on: Oct 28, 2026 | 8:00 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడం, తమిళం, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. విజయ్ సేతుపతి అవార్డ్ విన్నింగ్ మూవీ ‘బత్తా’, అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్, సందీప్ కిషన్ సిగ్మా, ఫహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాలతో పాటు కీర్తి సురేష్ అక్క, రుద్రవనం పీఎస్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. అయితే వీటికంటే ముందే బుధవారం (అక్టోబర్ 28) అర్ధరాత్రి నుంచే ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిరీస్. స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక అమ్మాయిల హాస్టల్‌లో జరిగేన భయానక ఘటనల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. ఉన్నత చదువుల కోసం కొందరు అమ్మాయిలు ఓ హాస్టల్‌లో దిగుతారు. మొదట అక్కడ అంతా బాగానే ఉంటుంది. కానీ క్రమ క్రమంగా పరిస్థితులు మారిపోతాయి. హాస్టల్‌‍లో ని అమ్మాయిలకు ఊహించని ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కో విద్యార్థిని అనుమానాస్పదంగా మిస్ అవుతుంటుంది. గుర్రంపై ఓ తల లేని మొండెం ఆకారం వచ్చి అమ్మాయిలను తాడుతో కట్టి ఎత్తుకెళ్తుంది. దీంతో హాస్టల్ లో దెయ్యాలున్నాయని అందరూ భయపడిపోతారు. కానీ ఓ యువతి మాత్రం హాస్టల్ లో దెయ్యాలు లేవని నిరూపించాలనుకుని సోషల్ మీడియాలో వీడియో పెట్టాలని చూస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ హాస్టల్‌లో అమ్మాయిల మిస్సింగ్‌కు కారణం ఏంటి? వింత ఆకారం భ్రమా లేక నిజమా? హాస్టల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

 

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ పేరు ‘హాస్టల్ హాద్సా’ (Hostel Haadsa) సచిన్ గోటాడ్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిరీస్ లో రచనా మిస్త్రీ, సుష్మా కోల్హే, పూర్ణిమ, ప్రాజక్తా అవినాష్ వాడయే తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫర్ ‘ఫ్రీ 5 ఆన్ జీ5’ (Free 5 on ZEE5) లో భాగంగా ఈ హాస్టల్ హాద్సా సిరీస్ ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ కు వచ్చింది. అంటే, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రుసుము లేకుండా ఉచితంగానే ఈ వెబ్ సిరీస్‌ను ఓటీటీలో వీక్షించవచ్చు. హారర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి హాస్టల్ హద్సా మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.

జీ5 ఓటీటీలో ఉచితంగా హాస్టల్ హద్సా వెబ్ సిరీస్..

‘హాస్టల్ హాద్సా’ ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us