సమంత డిజిటల్ ఎంట్రీ అంటూ భారీ హైప్ క్రియేట్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ మరోసారి బజ్ క్రియేట్ చేస్తోంది. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ వెబ్ సిరీస్‌ను… ఎలాంటి కారణాలు వెల్లడించకుండా సడన్‌గా వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా న్యూ రిలీజ్‌డేట్ ను ఫిక్స్ చేశారట. తాండవ్ వివాదంతో భయపడిన ఫ్యామిలీ మ్యాన్ టీమ్… కంటెంట్‌ను ఫైన్ ట్యూన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎలాంటి వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా కొత్తగా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారన్నది నయా అప్‌డేట్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు రావటంతో జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ది ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో రెండో సీజన్ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సమంత డిజిటల్ ఎంట్రీ, అది కూడా నెగెటివ్ రోల్ అన్న ప్రచారం జరుగుతుండటంతో సౌత్‌లోనూ ఫ్యామిలీ మ్యాన్ 2 మీద బజ్ క్రియేట్ అవుతోంది. మరి ఆ అంచనాలు ది ఫ్యామిలీ మ్యాన్ 2 రీచ్ అవుతుందేమో చూడాలి.