
పాలమ్మినా.. పూలమ్మినా.. అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి. అలాగే ఆయన ప్రసంగాలు, డ్యాన్సులకు ఇప్పుడు నెట్టింట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే మొదటి సారిగా ఓ ఎంటర్ టైన్మెంట్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు మల్లారెడ్డి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న సర్కార్ షోలో సందడి చేశారీ మాజీ మంత్రి. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్ లో తనదైన డైలాగులు, డ్యాన్స్ లు చేసి ఆహూతులను అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుంది. మరి ఇప్పటికే రాజకీయాల్లో ఓ ట్రెండ్ సృష్టించిన మల్లారెడ్డి ఈ ఓటీటీషోలో ఏ ఏమేర ఆకట్టుకుంటారో చూడాలి.
కాగా ఓటీటీలో బాగా హిట్ అయిన ఎంటర్ టైన్మెంట్ టాక్ షోల్లో సర్కార్ ఒకటి. ఇప్పటికే ఈ షో సక్సెస్ ఫుల్ గా ఐదు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఆరు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఈ శుక్రవారం (ఏప్రిల్ 10) స్ట్రీమింగ్ అయ్యే ఏడో ఎపిసోడ్ లో పాపం ప్రతాప్ చిత్ర బృందం సందడి చేయనుంది. హీరో తిరువీర్, ప్రసాద్ బెహరాతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఈ సర్కార్ లో పాల్గొననున్నారు. బహుశా దీని తర్వాతి ఎపిసోడ్ అంటే ఎనిమిదో ఎపిసోడ్ లోనే మాజీ మంత్రి మల్లా రెడ్డి పాల్గొనున్నారని తెలుస్తోంది. అంటే వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 17) ఆహా ఓటీటీలో మల్లారెడ్డి ఎంటర్ టైన్మెంట్ ను మనం ఆస్వాదించవచ్చన్న మాట.
Self-Made. Fearless. Unstoppable. 🔥
For the first time ever, @chmallareddyMLA steps into a reality show… and the game just got bigger. 👑Coming soon on #SarkaarS6 , stay tuned!#MallaReddy #MLA #BRS #Sarkaar pic.twitter.com/cYIV1t2Ez6
— ahavideoin (@ahavideoIN) April 8, 2026
For the First Time Ever… A Self-Made Powerhouse is Stepping Into a Reality Show! Comment below 👇🏻
Coming soon on #SarkaarS6 , stay tuned! pic.twitter.com/48gslb0VFj
— ahavideoin (@ahavideoIN) April 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.