Cinema : ఇదెక్కడి క్రేజ్ మావ.. థియేటర్లలోకి వచ్చినట్లే తెలీదు.. కట్ చేస్తే.. ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ప్రస్తుతం ఈ మూవీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఐఎమ్డీబీలో 8.7 రేటింగ్ ఉండగా.. దాదాపు ఏడాది తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ మూవీ పేరెంటో మీకు తెలుసా. ?

Cinema : ఇదెక్కడి క్రేజ్ మావ.. థియేటర్లలోకి వచ్చినట్లే తెలీదు.. కట్ చేస్తే.. ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతుంది..
Drinker Sai

Updated on: Jun 01, 2026 | 8:03 AM

ఇటీవల కాలంలో ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ ఏడాది క్రితం బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఓ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది. ధర్మ మహేష్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా పేరు డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ సంయుక్తంగా నిర్మించారు. డ్రింకర్ సాయి మూవీకి తిరుమల శెట్టి దర్శకత్వం వహించగా.. ఇందులో ఐశ్వర్య కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు, హై బడ్జెట్ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు మేకర్స్.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం అంతగా కమర్షియల్ హిట్ కాలేదు. ఐఎమ్డీబీలో 8.7 రేటింగ్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ట్రాప్ ట్రెండింగ్ చిత్రాల్లో మొదటి స్థానంలో ఉందంటే ఓటీటీలో ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చెప్పక్కర్లేదు. మే 27 నుంచి ఈ చిత్రం జీ5లో అందుబాటులోకి వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ ధర్మ మహేష్, ఐశ్వర్య తమ నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఒక సాధారణ యువకుడి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, అతడి ప్రేమ, ఆత్మ గౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us