
అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. డైరెక్టర్ శశాంక్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మించారు. గాందీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. తెలుగుతోపాటు వివిధ భాషలలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్ ద్వారా మంచి క్యూరియాసిటీ ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించగా.. రమా రాజమౌళి స్టైలిస్ట్ గా, ప్రవీణ్ ఆంటోని ఎడిటర్ వర్క్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘సూరి’ (ఫహాద్ ఫాజిల్) అనే ఒక స్ట్రీట్ మేజిషియన్ పాత్రలో కనిపిస్తారు. ఎలాంటి నిజమైన శక్తులు లేకుండా కేవలం ట్రిక్స్‌తో జనాలను నమ్మిస్తూ జీవిస్తుంటాడు. అయితే అనుకోకుండా అతడి జీవితంలోకి అద్భుత మాయా శక్తులు ఉన్న ఓ చిన్న పాప ప్రవేశిస్తుంది. ఆ పాప ఎంట్రీతో అతని జీవితం ఎలా మలుపు తిరిగింది ?.. ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక స్వార్థపరుడైన వ్యక్తి చెడు నుంచి మంచి వైపు మారే ప్రయాణాన్ని ఇందులో చూపించారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..