Parasuram: ఛాన్సులు లేనప్పుడు రూ. 10 లక్షల చెక్కు ఇచ్చారు.. ఆ హీరో తండ్రి పేరే నా కుమారుడికి పెట్టుకున్నా

గీత గోవిందం సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు పరశురామ్. స్టార్ హీరో మహేష్ బాబుతో సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాను కూడా తెరకెక్కించారీ క్రేజీ డైరెక్టర్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన జీవితంలో ఎదురైన కష్ట సుఖాలను పంచుకున్నారు.

Parasuram: ఛాన్సులు లేనప్పుడు రూ. 10 లక్షల చెక్కు ఇచ్చారు.. ఆ హీరో తండ్రి పేరే నా కుమారుడికి పెట్టుకున్నా
Director Parasuram

Updated on: Oct 14, 2026 | 4:45 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో పరశురామ్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారాయన. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకుని యువత సినిమాను తెరకెక్కించారు. డైరెక్టర్ గా మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత రవితేజతో చేసిన ఆంజనేయులు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినా నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఆపై నారా రోహిత్ తో సోలో సినిమా తీసి మరో సాలిడ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు పరశురామ్. అయితే ఆంజనేయులు తర్వాత మళ్లీ రవితేజతోనే సారొచ్చారు సినిమా తీశారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో సహజంగానే ఈ డైరెక్టర్ కు అవకాశాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పరశురామ్ తన పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ గుర్తు చేసుకున్నారు. ‘సోలో’ సినిమా తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్లు ఇక త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ తర్వాత నువ్వే అంటూ నన్ను మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే రవితేజతో సారొచ్చారు మూవీ చేశా. అది నా డ్రీం ప్రాజెక్ట్. కానీ కొన్ని తప్పుల వల్ల పెద్దగా ఆడలేదు. అప్పటివరకు నన్ను త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ అంటూ పొగిడిన వాళ్లే వదిలిపెట్టి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ నన్ను మానసికంగా గాయపరిచి వెళ్లారు. సారొచ్చారు తర్వాత నాకు 3 ఏళ్ల వరకు సినిమా ఆఫర్స్ రాలేదు. ఆ సమయంలో నాకు బన్నీ వాసు బాగా క్లోజ్. అప్పుడప్పుడూ ఫోన్ చేసి మాట్లాడేవాడు కూడా. ఏమైనా కథలు రాస్తున్నావా అని అడిగేవారు. బన్నీ వాసుతో మాట్లాడితే మనసుకు చాలా రిలీఫ్ గా ఉండేది. అలాగే బన్నీ వాసు నుంచి ఫోన్ వస్తే ఏదైనా ఆఫర్ ఉందేమో అని ఆశగా ఎదురు చూసేవాడిని.

నేను అనుకున్నట్లే ‘సారొచ్చారు’ సినిమా తర్వాత మూడేళ్లకు బన్నీ వాసు ఒక ఆఫర్ తీసుకువచ్చారు. అల్లు అరవింద్ గారు నిన్ను మీట్ కావాలని అంటున్నారు అని చెప్పాడు. వెంటనే వెళ్లి కలిశాను. అల్లు శిరీష్ కి నేను చేసిన సోలో సినిమా అంటే బాగా ఇష్టం అట. ఆ తరహాలో ఒక సాఫ్ట్ మూవీ చేయమని అల్లు అరవింద్ గారు నన్ను అడిగారు. వెంటనే రూ.10 లక్షల చెక్కు కూడా ఇచ్చారు. నాకు ఎడారిలో వర్షం పడ్డ ఫీలింగ్ కలిగింది. అప్పుడే శ్రీరస్తు శుభమస్తు సినిమా కథ రాసి అల్లు శిరీష్ తో తీశాను. ఆ సినిమా మంచి విజయమే సాధించింది. అదే సమయంలో నాకు కొడుకు పుట్టాడు. అల్లు అరవింద్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి క్లోజ్ గా ఉన్న ఆయనను అవి అని పిలుస్తుంటారు. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞతతో నా కొడుక్కి అవ్యాన్ అని పేరు పెట్టాను’ అని పరశురామ్ అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు.

కాగా శ్రీరస్తు శుభమస్తు తర్వాత పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాగే సర్కారు వారి పాట, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా మంచి వసూళ్లనే రాబట్టాయి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us