
బుల్లితెరపై బిగ్బాస్ (Bigg Boss) రియాల్టీ షోది ప్రత్యేకమైన స్థానం. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల బిగ్బాస్ హిందీ 15వ సీజన్ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ షోకు ఎన్ని అవాంతరాలు.. ఆరోపణలు ఎదురైన ప్రేక్షకుల ముందుకు ఎంటర్టైన్మెంట్ను తీసుకురావడానికి ఎప్పటికప్పుడు సరికొత్తగా ముస్తాబవుతుంది. అయితే తెలుగు బిగ్బాస్ సీజన్ 5 మాత్రం ప్రేక్షకులను ఆశించినంతగా అలరించలేకపోయింది. గేమ్స్, టాస్కుల కంటే కంటెస్టెంట్స్ శ్రుతిమించిన ప్రవర్తనలు.. హద్దుదాటిన చేష్టలు ప్రేక్షకులకు విసుగుపుట్టించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని స్థితికి ఈ షో వచ్చేసింది. దీంతో సీజన్ 5 టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది. అయితే ప్రేక్షకులకు ఈసారి 24 గంటల ఎంటర్టైన్మెంట్ అందించేందుకు తెలుగు బిగ్బాస్ ఓటీటీని తీసుకురాబోతున్నట్లుగా గతంలోనే నిర్వాహకులు ప్రకటించారు.
దీంతో బిగ్బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎప్పటినుంచి ఈ షో ప్రారంభం కాబోతుందంటూ సోషల్ మీడియాలో రోజూకో వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఈ షో ప్రారంభం కోసం జనాలు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలుగు బిగ్బాస్ ఓటీటీ లోగో విడుదల చేశారు నిర్వాహకులు. తాజాగా వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు బిగ్బాస్ ఓటీటీ లోగో ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే తెలుగు బిగ్బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించారు. నేరుగా బిగ్ బాస్ ఇంటి నుంచే ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్..అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ వేసింది. త్వరలోనే షో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లోగో ప్రోమో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.
Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..