OTT Movie: అమ్మాయిలను చంపి పర్‌ఫ్యూమ్ తయారుచేసే సైకో కిల్లర్.. ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్..10కి 10 రేటింగ్

సాధారణంగా ఇలాంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్ లోనే వస్తుంటాయి. అయితే ఈ మధ్యన తెలుగులోనూ ఈ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోచే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కు ఐఎమ్ డీబీలో ఏకంగా 10 కి 10 రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: అమ్మాయిలను చంపి పర్‌ఫ్యూమ్ తయారుచేసే సైకో కిల్లర్.. ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్..10కి 10 రేటింగ్
OTT Movie

Updated on: Oct 13, 2026 | 11:18 AM

ప్రస్తుతం సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో ఆడకపోయినా ఈ జానర్ సినిమాలు ఓటీటీలో మాత్రం అదరగొడుతుంటాయి. భాషతో సంబంధం లేకుండా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఓటీటీలో తెగ చూస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే. అమ్మాయిలను చంపి వారి శరీరాల నుంచి పర్ ఫ్యూమ్ తీసే కాన్సెప్ట్ తో ఇప్పటికే హాలీవుడ్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు ఉత్తమ మిస్టరీ చిత్రం అవార్డు కూడా వచ్చింది. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 10కి 10 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ ఒక బ్యాంకు ఉద్యోగి. పదేళ్ల వయసులో జరిగిన ఒక చేదు అనుభవం ఆమెను నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. ఇంతలో ఆమె ఇంట్లోకి ఒక అపరిచితుడు వచ్చి ఆమె పక్కనే పడుకుని, ఎలాంటి హాని తలపెట్టకుండా ఉదయాన్నే వెళ్లిపోతుంటాడు. మరోవైపు నగరంలో ఒక సైకో కిల్లర్ సంచరిస్తూ మహిళలను వరుసగా హతమారుస్తుంటాడు. అమ్మాయిల చేతుల నుంచి ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాన్ని (పర్‌ఫ్యూమ్) సేకరించడమే లక్ష్యంగా ఆ కిల్లర్ ఈ క్రూరమైన నేరాలకు పాల్పడుతుంటాడు. మరి ఆ సైకో కిల్లర్ ఎవరు? అతని బారి నుంచి హీరోయిన్ ఎలా తన ప్రాణాలను కాపాడుకుంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ముఖ్యంగా ఈ సినిమాలో సైకో కిల్లర్ గతం, అతడు హత్యలు చేయడానికి గల కారణాలు ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోన్న ఈ సినిమా పేరు మయూఖ. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్ గా ఉన్న అమన్ మసూద్ ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఓ కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్ పాయల్ చెంగప్ప మయూఖ పాత్రలో అదరగొట్టింది. శ్రీకాంత్ కాండ్రెగుల అలియాస్ శ్రీ తేజ్ ఎస్‌కే తెరకెక్కించిన ఈ సినిమాలో దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా డబ్బారా కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకు ముందు ప్రతిష్టాత్మక ‘న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్’ (NYIFA) వేదికపై ఉత్తమ మిస్టరీ చిత్రం పురస్కారం గెల్చుకుందీ తెలుగు సినిమా. వీటన్నింటికి మించి ఐఎమ్‌డీబీ సంస్థ మయూఖ సినిమాకు 10కి 10 రేటింగ్ ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న మయూఖ ఏకంగా ఏకంగా రెండు ఓటీటీల్లోకి వచ్చేయనుందని తెలుస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవనుందని సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది.

మయూఖ సినిమా ట్రైలర్..h3>

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us