Anupama Parameswaran : సడెన్‏గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. ఊహించని ట్విస్టులు..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దక్షిణాదిలో బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది అరడజనుకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అందులో దాదాపు మూడు నాలుగు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Anupama Parameswaran : సడెన్‏గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. ఊహించని ట్విస్టులు..
Anupama Parameswaran Lockdo

Updated on: Mar 11, 2026 | 9:06 AM

అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీనేజ్ లోనే ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో కథానాయకగా మారింది. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేసింది. సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. గతేడాది అరడజను సినిమాలతో అలరించింది. వాటిలో దాదాపు మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొత్త ఏడాదిలో ఓ థ్రిల్లర్ సినిమాతో వచ్చింది. అయితే ఇప్పుడు అదే సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళం, తమిళంతోపాటు తెలుగులోనూ ఆ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా పేరు లాక్ డౌన్. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తమిళంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా.. నూతన దర్శకుడు ఎఆర్ జీవా దర్శకత్వం వహించారు. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. లాక్ డౌన్ గురించి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కేవలం అనుపమ చుట్టూ మాత్మమే కథ తిరగడం.. అలాగే ఎప్పుడో గడిచిన లాక్ డౌన్ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడంతో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

కథ విషయానికి వస్తే.. చదువు పూర్తి చేసిన ఓ అమ్మాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్తుంది. కొన్నాళ్లకు ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. కానీ ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ల ముందు దాచేస్తుంది. అప్పుడే లాక్ డౌన్ రావడంతో వైద్య సహాయం అందక ఇబ్బంది పడుతుంది. లాక్ డౌన్ కారణంగా అనుపమతోపాటు ఎంతో మంది పడిన ఇబ్బందులను ఈ చిత్రంలో చూపించారు. చివరకు అనుపమ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us