
నందమూరి నటసింహం బాలకృష్ణ అటు వెండితెరపైనే కాకుండా.. ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ రాణిస్తున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో యాంకర్‌గానూ సత్తా చాటుతున్నారు బాలయ్య. ఈ షో ద్వారా ఇప్పటికే మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారిని తనదైన ప్రశ్నలతో ఆటపట్టించారు బాలయ్య. ఇక ఇటీవలే ఈషోలో మాస్ మాహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సైతం సందడి చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 24న టెలికాస్ట్ కానున్నట్లుగా ఇప్పటికే నిర్వహకులు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. బాలయ్యతో కలిసి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే వేదికపై బన్నీ అలరించనున్నారు. అల్లు అర్జున్‌తోపాటు.. పుష్ప టీం కూడా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్వహకులు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న టెలికాస్ట్ కానుంది.
ట్వీట్..
ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటించారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పుష్ప 2 పార్ట్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..