Mirzapur 3: గుడ్‌న్యూస్ చెప్పిన గుడ్డూ భయ్యా.. మీర్జాపూర్‌ సీజన్‌ 3 వచ్చేది ఎప్పుడంటే?

|

Dec 05, 2022 | 5:49 PM

ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న మీర్జాపూర్‌ సిరీస్‌ ముచ్చటగా మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈమేరకు సిరీస్‌స్‌లో గుడ్డూ భయ్యా పాత్రలో అలరించిన అలీ ఫజల్ కీలక ప్రకటన చేశాడు.

Mirzapur 3: గుడ్‌న్యూస్ చెప్పిన గుడ్డూ భయ్యా.. మీర్జాపూర్‌ సీజన్‌ 3 వచ్చేది ఎప్పుడంటే?
Mirzapur Web Series
Follow us on

మీర్జాపూర్‌.. మన దేశంలోభారీ విజయం సాధించిన వెబ్‌ సిరీస్‌లలో ఇది కూడా ఒకటి. క్రైం థ్రిల్లర్‌ నేపథ్యంతో కూడిన ఈ సిరీస్‌ పలు రికార్డులు కొల్లగొట్టింది. మొదట కేవలం హిందీలోనే స్ట్రీమింగ్‌ అయిన ఈ క్రైం సిరీస్‌ ఆతర్వాత తెలుగుతో సహా అనేక భాషల్లోనూ ప్రసారమైంది. మితిమీరిన హింస, ద్వంద్వార్థాలు ఉన్నప్పటికీ విడుదలైన అన్ని చోట్లా సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులోని మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా, అఖండానంద్‌ పాత్రలు అందరికీ గుర్తుండిపోయాయి. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న మీర్జాపూర్‌ సిరీస్‌ ముచ్చటగా మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈమేరకు సిరీస్‌స్‌లో గుడ్డూ భయ్యా పాత్రలో అలరించిన అలీ ఫజల్ కీలక ప్రకటన చేశాడు. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు.ఈ సందర్భంగా వెబ్ సిరీస్ బృందంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా గోలు గుప్తా పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది షూటింగ్ పూర్తయిన సందర్భంగా గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. కాగా తన అన్న, చెల్లిని దారుణంగా చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవుతుంది. మరి మూడో సీజన్‌ ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. కాగా 2023లో ఈ సిరీస్ ను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సిరీస్ లో గుడ్డూ పంటిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..