
స్టార్ హీరోయిన్ త్రిషకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె నటించిన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, లవ్, డేటింగ్ ఇతర అంశాలు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. ఇక టీవీకే అధినేత హీరో విజయ్ తో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.అంతేకాదు ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి కూడా రానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఓ సందర్భంలో తనకూ ముఖ్యమంత్రి కావాలని ఉందని తన మనసులో కోరికను బయట పెట్టిందీ అందాల తార. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మరి త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందా?లేదా? అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆమె ఓ సినిమాలో రాజకీయనాయకురాలిగా నటించింది. అది కూడా విలన్ గా. ఎంతలా అంటే.. అధికార పీఠం కోసం ప్రాణంగా ప్రేమించిన ప్రియుడినే వెన్నుపోటు పొడిచి చంపేసే పాత్ర. ఆ సినిమా ఏదనుకుంటున్నారా? 2016లో వచ్చిన ఈ తమిళ సినిమా పేరు కోడి. తెలుగులో ధర్మయోగిగా రిలీజైంది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ధర్మయోగి సినిమాలో హీరో ధనుష్ అన్నాదమ్ములుగా డబుల్ రోల్ చేశాడు.
ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో త్రిష అద్భతంగా నటించింది. ధనుష్ ప్రియురాలిగా, అలాగే పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా సినిమాలో ఆమె అభినయం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇందులో తన రాజకీయ భవిష్యత్ కోసం చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ధనుష్ ను వెన్నుపోటు పొడిచి చంపుతుంది త్రిష. అంతేకాదు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఇదే సమయంలో ధనుష్ సోదరుడు ఎంటర్ అవుతాడు? మరి త్రిష మీద అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? చివరికి ఏమైంది అన్నదే ఈ సినిమా కథ.
కోడి (తెలుగులో ధర్మయోగి) సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూడొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.