Taapsee Pannu: ఆ బ్లాక్ బస్టర్ హిట్ సిక్వెల్‏కు సిద్ధం.. తన క్రేజీ థ్రిల్లర్ మూవీ కోసం తాప్సీ..

దీంతో మరోసారి ఈ మూవీ సిక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి కథనాన్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట రచయిత్రి కనికా ధిల్లాన్.

Taapsee Pannu: ఆ బ్లాక్ బస్టర్ హిట్ సిక్వెల్‏కు సిద్ధం.. తన క్రేజీ థ్రిల్లర్ మూవీ కోసం తాప్సీ..
Haseen Dillruba

Updated on: Jul 07, 2022 | 10:49 AM

తాప్సీ పన్ను (Taapsee Pannu), విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలలో నటించిన హసీన్ దిల్రుబా (Haseen Dillruba) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా సిక్వెల్ రాబోతుందట. ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన థ్రిల్లింగ్ మిస్టరీ చిత్రాలకు ఈ సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ రాలేదంట. దీంతో మరోసారి ఈ మూవీ సిక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి కథనాన్ని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట రచయిత్రి కనికా ధిల్లాన్.

ఇక ఇందులో కూడా తాప్సీ, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలలో నటించనున్నారని.. హర్షవర్దన్ రాణే కీలకపాత్రలో నటించనున్నారట. 2021లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా హసీన్ దిల్ రూబా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందా ? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీని ప్రశ్నించగా.. మరోసారి అలాంటి ఆఫర్ వస్తే తాను ఎప్పటికీ తిరస్కరించలేనని చెప్పింది. దీంతో సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతుండడంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాప్సీ శభాష్ మిథు సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us