Sonakshi Sinha: సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్‏లో సోనాక్షి సిన్హా.. ఛాలెంజింగ్ రోల్‍లో కనిపించనున్న..

Sonakshi Sinha:  ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోలతోపాటు.. హీరోయిన్లు కూడా పాత్ర కోసం డేరింగ్ చేస్తున్నారు. సినిమాలకు తగ్గట్టుగా

Sonakshi Sinha: సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్‏లో సోనాక్షి సిన్హా.. ఛాలెంజింగ్ రోల్‍లో కనిపించనున్న..
Sonakshi Sinha

Updated on: Jul 08, 2021 | 9:35 AM

Sonakshi Sinha:  ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోలతోపాటు.. హీరోయిన్లు కూడా పాత్ర కోసం డేరింగ్ చేస్తున్నారు. సినిమాలకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడమే కాకుండా.. బోల్డ్ పాత్రలు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం బోల్డ్ పాత్రలలో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణా సత్తారు తెరకెక్కించనున్న సినిమాలో కాజల్ వేశ్వలో పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ సైతం అదే పాత్ర పోషించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా.. ఇప్పుడిప్పుడే కెరీర్ కాస్త మెరుగుపడుతుంది. గతంలో సినిమా ఎంపిక విషయంలో చేసిన తప్పులను ఇప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. అటు వెబ్ సిరీస్‏లలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇప్పటికే సోనాక్షి వెబ్ సిరీస్ చేసినా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది.  తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ‘హిరామండి’ అనే వెబ్ సిరీస్‏లో నటించనుందట. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన `రౌడీ రాథోడ్` సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఇప్పుడు  ఓ వేశ్య పాత్రలో కనిపించబోతుందట సోనాక్షి. ఇందుకోసం సోనాక్షి కథక్ కూడా నేర్చుకుందట. టాలెంటెడ్ కథక్ డ్యాన్సర్ ఎందుకు వేశ్యాగా మారుతుంది అనే నేపథ్యంలో సినిమా రాబోతున్నట్లగా టాక్.

Also Read: Kamna Jethmalani: కెరీర్ టాప్‏లో ఉన్నప్పుడే పెళ్లి జరిగింది… ఇప్పటికీ ఒక కోరిక మిగిలిందంటున్న హీరోయిన్..

WhatsApp: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా..? అయితే ఈ విధంగా చేయండి..!

టెస్టుల్లో వీరోచిత ఇన్నింగ్స్.. బౌలర్లను ఉతికి ఆరేశాడు.. సూపర్ సెంచరీతో అదరగొట్టిన మాజీ ఆర్సీబీ ప్లేయర్!

Jagapathi Babu: రాజకీయ నాయకుడిగా జగ్గుభాయ్ న్యూలుక్.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటి ఇచ్చిన హీరో..